చిన్న చిత్రాలకు పెద్దపీట : నవ్యత, కథకు అగ్రస్థానం

వెండితెర జ్ఞాపకం -2025
కాలం కరగిపోయినప్పుడు అనుభూతులన్నీ కరగిపోవు. కొన్ని మన మనస్సుని అందంగా సృజిస్తాయి. మనలో చాలామంది జీవనంలో వెండితెర ఒక ప్రధానమైన భాగం సినిమా మన నేస్తం. అది అదిరికీ
అన్నీ పంచుతుంది. సినిమా మొదలై వంద సంవత్సరాలకు చేరువ అయ్యింది. ప్రతి ఏడాది తెర సాక్షిగా మంచి కథలూ సమర్పించి కాలం తెరలో అదృశ్యమై పోతుంది. 2025 ఒకరకంగా చిన్న సినిమాల పర్వం నడిచింది. పెద్ద కథా నాయకుల చిత్రాలు తక్కువగా వచ్చాయి. చిరంజీవి వంటి కథానాయకులు ఈ సారి కేవలం ‘షూటింగ్’ లకే పరిమితం అయ్యారు. వెంకటేశ్ , బాలయ్య , నాగార్జున ఈ సారి తెరపై సందడి చేశారు. గడచిన సంవత్సరం ప్రేక్షకుల అభిరుచికి ప్రతిబింబంగా నిలిచింది. చిన్న చిత్రాలకు ఆదరణ, ప్రోత్సాహం లభించింది. ఈ సారి వేసవికి భారీ చిత్రాలు రాకపోవడం విశేషం. ఒక్కసారి 2025 సంవత్సరం వెండితెర పై తన మెరుపుల్ని, ఉరుముల్ని అందించింది.
కేలండర్ లో పేజీలు కదులుతున్నాయి గానీ జ్ఞాపకాలు ‘మనస్సుని’ చేరి అదృశ్యం అయినా సినిమాలు ఇప్పుడు చిన్ని తెరపై , ఓటిటి పైన శాశ్వతంగా పలకరిస్తున్నాయి. అది ఆనందం కలిగించే అంశం.



ఒక్కసారి జనవరి నుంచి వచ్చిన సినిమాలను విశ్లేషించి చూద్దాం. ఈ సారి సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్ కథా నాయకుడుగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ‘డాకూ మహారాజ్’ సినిమా విజయ తీరాలను చేరింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా బావున్నా పరాజయం దిశగా వెళ్ళింది. ఫిబ్రవరిలో శివరాత్రికి విడుదలైన ‘తండేల్’ చిత్రం ప్రేమ కథా చిత్రంగా ఆదరణ పొందడం గమనార్హం. మార్చి నెలలో 20 చిత్రాలు తీర్పు కోరినా ‘కోర్టు’ చిత్రం వైపు ప్రేక్షకులు అడుగులు వేశారు. నాని నిర్మాతగా విజయం పొందారు. ఏప్రిల్ నెలలో 34 చిత్రాలు వచ్చాయి. అన్నీ నిరాశ పరిచాయి. మే నెల అందరికీ , సినీ ప్రియులైన విద్యార్థి బృందానికి సెలవులైనా హిట్ -3, భైరవి చిత్రాలు సగటు విజయం నమోదుచేశాయి. జూన్ నెలలో భారీ అంచనాల మధ్య విడుదలైన కుబేర , కన్నప్ప చిత్రాలకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. భారీ హీరోలు ఉన్న ప్రేక్షకులకు ఎందుకో నచ్చలేదు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చినా ప్రేక్షకుల్ని మాత్రం తృప్తి పరచలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ‘ఓ జీ’ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. అక్టోబర్ లో వచ్చిన కాంతార 2 ప్రేక్షకుల్ని ఆకర్షించింది. సాంకేతిక మార్పులతో వచ్చిన బాహుబలి ఈ సారి ఆశించినంతగా ప్రేక్షకుల్ని చేరలేదు. చిన్న చిత్రం రాజా వెడ్స్ రాంబాయి యువ ప్రేక్షకుల్ని ర ప్పించింది. పాటలు మెప్పించాయి. ఆంధ్రా కింగ్ చిత్రం రామ్ సగటు చిత్రంగా ముద్ర వేసుకుంది. మిగతా చిత్రాలు తెరపై అంతగా కనబడలేదు. వారం తరువాత విడుదలైన అఖండ – 2 ఆధ్యాత్మిక ముద్ర వేసింది. ఈసారి తమన్ సంగీతం బాగా నిలబడింది. 2025లో నవ్యత, కథాబలం ఉన్న చిత్రాలు అగ్రభాగంలో నిలిచాయి.

ఇది 2025 జ్ఞాపకాల పొదరిల్లు.
—— డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,
రచయిత , సినీ పరిశోధకులు

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *