రాజధాని నగరంలోని రాజమోహల్లా పద్మశాలిభవన్ లో సోమవారం ఘనంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో సుమారు 100 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం నాయకుడు శ్రీ బొల్లా శివశంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు దాదాపు 800 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లో, మహారాష్ట్రలో సోలాపూర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాలలో కూడా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు శ్రీ శివశంకర్ తెలిపారు.విజయవంతంగా జరిగిన ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, ప్రముఖ ఔషధ కంపెనీలు, నగరంలోని ప్రముఖ ఆసుపత్రులు మరియు వివిధ రంగాలకు చెందిన సుమారు 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగుల ఎంపిక నిర్వహించాయి. తమ సంతానం ఉద్యోగాలకు ఎంపిక కావడంపట్ల అభ్యర్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి , మహిళా ప్రముఖులు వనం దుష్యంతుల ,పొరండ్ల శారద, నేతన్న యాత్ర టీమ్ సభ్యులు జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించడంలో సహకరించారు.





