రక్షణ దళాలలో సేవలందించేందుకు భారత రక్షణ శాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీములో భాగంగా భారత వాయుసేనలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగేళ్ళ పాటు ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరులుగా సేవలందించేందుకు యువతకు అవకాశం లభిస్తుంది. దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 1వ తేదీ గడువు. అవివాహితులైన యువకులు దరఖాస్తు చేయడానికి అర్హులు. 2006 జనవరి 1 నుంచి 2009 జూలై 1 మధ్య పుట్టినవారు అర్హులు. ఇంటర్మీడియట్ / 12వ తరగతిలో కనీసం 50% మార్కులు సాధించిన వారు అర్హులు. మరిన్ని వివరాలకోసం iafrecruitment.edcil.co.in వెబ్సైట్ చూడండి.
DISCLAIMER: Readers are recommended to make appropriate inquiries in relation to any advertisement published in this website.





