తెలుగువారి పండుగ సంక్రాంతిని రెండు తెలుగు రాష్ట్రల ప్రజలు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్నవాసులు పల్లెలకు వెళ్లి తమ బంధు మిత్రులతో సంతోషంగా గడిపారు. పల్లెలకు వెళ్లలేని వారు నగరాలలోనే పల్లె సంస్కృతిని ప్రతిబింభించే విధంగా పిల్లలకు భోగి పళ్ళు పోయడం, రంగోలి పోటీలు నిర్వహించడం విశేషం.
హైదరాబాద్ నగరంలోని కాప్రా సర్కిల్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ భావనారుషి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముగ్గులపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
శ్రీమతి జి. దీప పర్యవేక్షణ
లో పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.












