క్షేత్రస్థాయిలో పనిచేస్తూ విధినిర్వహణలో అకాలమరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా బుధవారం 22 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం, బాధిత కుటుంబానికి 5 సంవత్సరాల పాటు నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు చేతులు పనిచేయకుండా పోయిన జర్నలిస్టుకు లక్ష ఆర్ధిక సహాయం అందజేశారు. కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు పాల్గొన్నారు. అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.




