పాత్రికేయ దిగ్గజాల మోనోగ్రాఫ్స్ ఆవిష్కరణ

తెలంగాణ మీడియా అకాడమీ పదిమంది పాత్రికేయ దిగ్గజాల సూక్ష్మ జీవిత చిత్రణతో
కూడిన చిరు పుస్తకాలను (‘మోనోగ్రాఫ్’) ప్రచురించి బుధవారం ఆవిష్కరించింది.
నగరంలోని చాపెల్ రోడ్డులో మీడియా అకాడమీ ఆడిటోరియంలో తెలంగాణ మీడియా
అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి
చైర్మన్ మరియు విద్య మరియు ప్రజా వ్యవహారాల కోసం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
డాక్టర్ కె. కేశవరావు విడుదల చేశారు. తెలంగాణ శాసనమండలిచైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్య, ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడాక్టర్ కె. కేశవరావు విడుదల చేశారు.

పాత్రికేయ దిగ్గజాలు ఆబిద్ అలీఖాన్ , ధర్మవరపు సీతారాం, బేతనభొట్ల నాగేశ్వర రావు,
పొత్తూరి వెంకటేశ్వరా రావు, ఎం. ఎస్ ఆచార్య, ఎబికె ప్రసాద్, జిఎస్ వరదాచారి, సి రాఘవాచారి,
వి. హనుమంత రావు, ఆదిరాజు వేంకటేశ్వరరావు . ఈ చిరుపుస్తకాల రచయితలు వరుసగా ..
ఎం ఏ మాజిద్, ధర్మవరపు నాగార్జున, బి ఎస్ రామకృష్ణ, కె. రామచంద్ర మూర్తి, మాఢభూషి శ్రీధర్,
గోవిందరాజు చక్రధర్, టి ఉడయవర్లు, ఆర్ వి రామారావు, వి సతీష్ బాబు, జ్వాలా నరసింహా రావు.

చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరిస్తున్న డాక్టర్ కె. కేశవరావు, కె. శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *