టౌన్షిప్ సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

దమ్మాయిగూడ సాకేత్ రోడ్డులో ఉన్న పద్మశాలి టౌన్షిప్ లో నివసించే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గా ఏర్పడి ఇటీవల కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించుకున్నారు. వనం విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలలో ఈ కింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా ఓవల్దాస్ చక్రపాణి గెలిచారు.ఉపాధ్యక్షులుగా దొంత శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా నారా జనార్దన్,కోశాధికారిగా పలాడి శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శిగా కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.టౌన్ షిప్ అభివృద్ధికి భావనాఋషి సొసైటీ కార్యవర్గానికి తమ వంతు తోడ్పాటును అందిస్తామని నూతన అధ్యక్షులు చక్రపాణి తెలిపారు.అదేవిధంగా సీనియర్లకు అండగా ఉంటామని కూడా ప్రకటించారు. భావనాఋషి సొసైటీ అధ్యక్షులు సీత ఆంజనేయులు, దమ్మాయిగూడ మాజీ సర్పంచ్ ,కౌన్సిలర్ పాండాల యాదగిరి గౌడ్ ,దమ్మాయిగూడ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పారామారావు ,కార్యవర్గ సభ్యురాలు దీప అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *