భువనగిరి సమీప మానేపల్లి హిల్స్ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి రెండవ వారంలో జరుగుతాయి. 8వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 9న ధ్వజారోహణం, 15వ తేదీన శ్రీవారి కళ్యాణోత్సవం జరుగుతాయి. దేవస్థానంలో ప్రతిరోజు సహస్రనామార్చన, స్వామివారి కళ్యాణ మహోత్సవం, ప్రతి ఏకాదశి విశేష ఉత్సవాలు, ప్రతి శుక్రవారం అభిషేక తిరుమంజనోత్సవం జరుగుతాయి.




