మీ అంతరంగం స్వాతికిరణం అయ్యి ప్రణతి ప్రణతి అని ప్రణయ నాథ జగతికి వందనం చేసింది. చదువుల తల్లికి సంగీత, సాహిత్య, సమలంకృతే అని వందనం చేసింది. నెమలికి నేర్పిన నడకలు మురళికి అందని పిలుపులు ఇవి అని వెండితెర మీ భావాలుని చూసి మురిసిపోయింది. మీ ఊహలు చందమామరావే అని స్వాగతిస్తాయి. బృందావనంలో విహరిస్తాయి. మీ రాగంలోను పల్లవి అయ్యి శంకరాభరణాన్ని అర్చిస్తాయి. మీ భావచిత్రాలని వీక్షించిన వెండితెర చిన్నితెర దొరకునా ఇటువంటి సేవా అని సంబరపడిపోతాయి. ఏకులం నీదంటే గోకులం నవ్వింది అన్న మీ సందేశాలు సమజాన్ని నిలదీస్తాయి. చిత్రాలు భావ క్షీర సాగరసంగమాలు. మీ పదాలు ఊయలలో చిన్నారినే గాదు అలివేలు మంగాపతి అన్నయమ్య లాలిని మించి లాలిస్తాయి. లాలి లాలి అని అమ్మ హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. శ్రీరామనవమి నాడు రామకనవేమిరా అన్న పాటలు ప్రతి పందిరిలో వినిపిస్తాయి. మీ ప్రేమ భావనలు మనస్సు పలికే సందేశ గీతంలా అనిపిస్తాయి.వేదం అణువణువున నాదం అన్న మీ ప్రతిభకు శిష్య అంతరంగాలు ఆచార్య దేవో భవ అని సహృదయవందనం చేస్తాయి. శుభలేఖలు రాగాల పల్లకిని మ్రోస్తాయి.
ప్రతీక్షణం నుదుటిన విభూతిని అలకరించుకున్న కాశీ విశ్వనాధులు మీరు. శంకర నాదశరీరాపరా అని శంకరాభరణం అయిన మీరు చిత్ర విచిత్రంగా ఒక్కొక్కసారి బూడిదనిచ్చేవాడిని అని వైరాగ్య భావనలు సమర్పించారు. వేళ వేళ అని మద్దగోవిందుడే అని హరినామ స్థురణ చేస్తారు.కన్నె మనస్సులని ఆకాశంలో ఆశల హరివిల్లుని వైపు నడిపించాయి. పారాహుషార్ అని తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమల్ని చెంత చేరి పరవశిస్తాయి. గోధూళివేళ, గువ్వల రెక్కల్ని కదిలిస్తాయి.సాయంసంధ్య సమయాన మీ భావ గంగలు శివాని శర్వాని అని అమ్మవారిని అభిషేకిస్తాయి. ఆనతినియ్యరా హరా అని శివయ్యని అభ్యర్ధిస్తాయి.మీ ప్రేమకథలు, సిగ్గుపూబంతి అయ్యి మొగ్గసింగారాలు ఉదయిస్తాయి. చిన్ని చిన్ని ఓ చిన్ని అని కోనసీమ పూతరేకులు రుచి చూపిస్తాయి. నల్లమబ్బు చల్లిన తొలకరి హరివిల్లుకి వందనం చేస్తాయి. తెల్లవారదే స్వామి అని సిరివెన్నెల కలం ఏడుకొండల వాడిని ఆత్మీయంగా పద సంకీర్తనచంద్రుడిలో వేడుకుంటాయి.మావిచిగురు తినగానే కోయిలలు గోంతులు వినిపిస్తాయి. ఈగాలి ఈనేల మీ చిత్రాలని చిరస్మరణీయంగా దాచుకుంటాయి. విధాత తలపున ప్రభవించిన జీవన వేదాల్ని ఆస్వాదిస్తాయి. సీతమ్మ అందాల్ని రామయ్య పాదాల్ని సేవిస్తాయి. మధుర వానజడిలో అందెల రవళిని అందిస్తాయి. పట్టిసీమ చెంత మంత్రపుష్పాలుని వినిపిస్తాయి. గంగానది హరిద్వార్ చెంత శృతిలయలు నినదిస్తాయి. వేణువు, అందెలు, స్వరం, సాహిత్యం, సంగీతం ఉన్నంత కాలం మీరు ఎప్పటికి మీ చిత్రాలులో కళాతపస్వి గా మెరుస్తారు.
డాక్టర్. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ, అధ్యాపకులు, పరిశోధకులు,




