ఈ వారం పుస్తకం — శతవసంతాల అరుణపథం

సింగారవేలు చెట్టియార్ ఎవరు?
షాపూర్జీ సక్లత్వాలా పేరు విన్నారా?
సోహన్ సింగ్ బక్నా ఏం చేశారు!
ఆచార్య నరేంద్రదేవ్ సాహసం ఏమిటి?
జతిన్దాస్, సూర్యసేన్, గణేష్ ఘోష్లను
ఎందుకు తలచుకోవాలి?
ఫిలిప్ స్పాట్, బెంజిమిన్ ఫ్రాన్సిస్ బ్రాడ్లేలు మనకేం అవుతారు? హేముకలానీ, కనకలతా బారువా పేర్లు తెలుసా? రాజమహేంద్ర ప్రతాప్ ఏవరు? ఎం.ఎన్.రాయ్ లెనిన్ ఏమన్నాడు? జడ్.ఎ. అహ్మద్, సజ్జాద్ జహీర్, మక్దూం మొహియుద్దీన్ల పాత్ర ఏమిటి?ఎస్వీఘాటే, గంగాధర అధికారి ఏం చేశారు?
లాలాలజపతిరాయ్ ని చంపిందెవరు?
సర్వభట్ల రామనాధం, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్లు చేసిన త్యాగం ఎలాంటిది? ఎందరో వీరులు, మేధావులు, తిరుగుబాటుదారులు – ఉద్య మాల్లో నడిచిన వాళ్లు … దేశం కోసం ప్రాణాలు విడిచిన వాళ్లు… జనం కోసం త్యాగాల ఎర్రజెండాపై ఎగిరిన వాళ్లు …
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అనే తొలి విత్తనాలు నాటి వంద సంవత్సరాలు అయింది. ఆ చారిత్రాత్మక సందర్భాన్నీ, ప్రజా పోరాటాలనీ తలుచుకుంటూ ప్రతి భావంతుడైన సీనియర్ జర్నలిస్టు, సంపాదకుడు ఆర్వీరామారావు ‘విశాలాంధ్ర’ దినపత్రికలో వరసగా వంద వ్యాసాలు రాశారు. వాటన్నిటితో శత వసంతాల అరుణ పథం’ అని ఓ పుస్తకం వేశారు. నూరేళ్ల చరిత్రని కేవలం 260 పేజీల్లో చెప్పడానికి ఆయనొక పద్ధతిని ఎంచుకున్నారు. ఆ స్కీమ్ ప్రకారం క్లుప్తంగా, స్పష్టంగా, సమర్థంగా రాయగలిగారు. ఆర్వీరామారావు వంద వ్యాసాల కోసం-కీలకమైన సంఘటనలు, త్యాగమూర్తులు, ప్రసిద్ధ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మేధావులు, చరిత్ర సృష్టించిన ఉద్యమాలు, కార్మిక, విద్యార్ధి, యువజన, ప్రజానాట్యమండలి, మహిళా సంఘాల పాత్రని ఒక క్రమంలో రాశారు. భగత్ సింగ్, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు నుంచి పీసీజోషీ, కంభంపాటి సత్యనారాయణ, దర్శి చెంచయ్య దాకా వేగుచుక్కలై వెలిగిన వాళ్లందరినీ గుర్తు చేసుకున్నారు. రక్తమోడిన రాజీలేని పోరాటాన్నీ, ఉరికంబం ఎక్కినా చెక్కుచెదరని ధైర్యాన్నీ, జైలు గో డల చీకటి మధ్య కన్నీటి తడిలో కరిగిపోయిన జీవితాల దైన్యాన్ని అంతే ఉద్వేగంతో రికార్డు చేశారు ఆర్వీ రామారావు. విశ్లేషణ చేసినా, దూకుడుగా రాసినా ఆ మంచి తెలుగు వాక్యం వేగంగా చదివిస్తుంది.
సాటి మనుషుల్ని హీనులుగా, బానిసలుగా చూడడం మానకపోతే సామాన్య జనం వూరుకోరనీ, తిరగబడతారనీ కమ్యూనిస్టు చేసిన ఈ హెచ్చరి కలు, కార్యాచరణ, సాయుధ పోరాటం నాటి భారతీయ సమాజాన్ని ప్రభావితం చేశాయి. కార్మికులు, రైతులు చేసిన త్యాగాలు వృథా కాలేదు. ఈ మహత్తర పోరా టాల్నీ, ప్రాణాన్ని బలి ఇచ్చిన సామాన్యుడి సాహసాన్నీ, కన్నీళ్లూ నెత్తుటితో తడి చిన చరిత్రనీ ఆర్వీ రామారావు, అతిశయోక్తులు లేకుండా, ఉపన్యాసాలు దంచ కుండా, సిన్సియర్ రికార్డు చేశారు. వందేళ్ల ఉద్యమాన్ని వంద డాక్యుమెంటరీ చిత్రాలుగా మన కళ్లముందు పరిచారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నుంచి ఇంద్రజిత్ గుప్తా దాకా, హిరేన్ ముఖర్జీ నుంచి భూపేష్ గుప్తా దాకా, సుందరయ్య రాజేశ్వరరావుల నుంచి రావి నారాయణరెడ్డి దాకా – కమ్యూనిస్టు ఉద్యమం ఎర్రమందారాలై వికసించడానికి కృషి చేసిన, సుఖమయమైన జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసిన ధన్యజీవులందర్నీ రామా రావు ఎంతో ప్రేమతో కృతజ్ఞతతో తలుచుకున్నారు.
వామపక్షాల అనైక్యత, కమ్యూనిస్టు ఉద్యమం చీలిక, పాలకులకు దగ్గరై పేదలకు దూరమైన కమ్యూనిస్టుల దయనీయ స్థితి గురించి కూడా రామా రావు, ఆవేదనతోనే అయినా స్పష్టంగా రాశారు. సంవత్సరాలు, తారీకులు, రుజు వులతో ఉద్యమ సమాచారాన్ని నిజాయితీగా రాశారు. కమ్యూనిస్టు కార్యకర్త లతో, సానుభూతిపరులతో కాకుండా, గత నూరేళ్ల చరిత్ర తెలుసుకోదగిన వాళ్లకి అందరికీ ఇది ఉపయోగపడే పుస్తకం. ఈజీగా ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా సూటిగా, సరళంగా రాయడానికి ఆర్వీరామారావు తీసుకున్న శ్రద్ధ మెచ్చుకోద గ్గది. ఈ రకంగా ఆయన ఒక పెద్ద బాధ్యతని నెరవేర్చారు.
పార్టీతో, అభ్యుదయ రచయిత సంఘంతో ఉన్న యాభైఏళ్ల ఆత్మీయ అనుబంధానికి ఆర్వీయార్ రుణం తీర్చుకున్నారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ఈ అరుణపథానికి, జర్నలిస్టు, రచయితా మందలపర్తి కిషోర్ ముందు మాట రాస్తూ, ‘ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదు- కానీ ప్రతి ఒక్కరూ ధనవంతులే. అవును, ఆనందం కన్నా, చిత్తశాంతి కన్నా మానసిక ఆందోళనల నుంచి విముక్తి పొందడం కన్నా మహనీయమైన సంపద లేముంటాయి మరి?” అని అన్న ‘ఉటోపియా’ స్వాప్నికుడు థామస్ మోర్ మాటల్ని గుర్తు చేశారు.
చెంచింది. ఒక సుదూరపు మహా స్వప్నం- సోషలిజం. ఒక బహుదూరపు బాటసారి – విప్లవోద్యమం.

-తాడి ప్రకాష్

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *