ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ (రమదాన్) ఉపవాసదీక్షలు మన రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం 18వ తేదీన నెలవంక దర్శనం కావడంతో హైదరాబాదులో రుయ్యత్ హిలాల్ కమిటీ 19 ఉదయం నుంచి ‘రోజా’ ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా ప్రతి రోజూ సాయంత్రం ఉపవాస దీక్ష విరమించేందుకు (ఇఫ్తార్) వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫీసు నుంచి ఒక గంట ముందు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.




