కలలు తెర తెరిచిన క్షణం
మనస్సులు మురిసిన సమయం
హృదయం అడుగులు నడిచిన కాలం
భావాల సమ్మోహనం
వెండితెర అనుబంధం
అభినయాల నుంచి అంతరంగాల పారవశ్యం
గీతాగోవిందం కథ పంచిన ప్రణయ కావ్యం
నిండు నూరేళ్ళు జీవనానికి ప్రయాణం
యువ హృదయ వీణ తంత్రులని సుతారంగా తాకిన అందాల ద్వయం
గీతా గోవింద స్వరపారిజాతం నట మాధుర్యం నుంచి మనువు దాకా పరుగులు తీసిన ప్రేమ కావ్యం గుబురు గడ్డాల విజయ్ కి అర్జున్ రెడ్డికి, శ్రీవల్లికి జరిగే పరిణయం నీలి మేఘానికి, వెన్నెలకు జత కలిసిన వెండితెర స్నేహం సామి సామి అని ఆడిపాడిన శ్రీవల్లికి పసుపు పారాణి సాక్షిగా పూలదండల నీడగా రాజపు సౌదాల వెలుగుల మధ్య రష్మిక గోపిక దేవరకొండ కృష్ణుడు యిక అపర బృందావనంయిక ఊహలు ఊపిరిపోసుకుంటాయి.రంగులన్నీ ఇంధ్రధనస్సులా మెరుస్తాయి కెమెరాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి పూలబాల రష్మిక కుర్రకారు మది సవ్వడి దేవరకొండకి కానుక రష్మిక చిరునవ్వుకి చందమామ చినబోయింది.
వర్షం చినుకు చిలిపిగా కురుస్తుంది
వేణువు స్వరం
పచ్చదనం జలపాతం
శిఖరం… హిమం.. కుసుమం… సీతాకోకచిలుక
కెరటం కేరింత
సాగరం అలలు
ఊయల లాలిపాట
అనుభూతి అనుబంధం
అక్షరం ఆలోచన
యిక నుంచి రష్మిక విజయ్
ప్రకృతి సౌందర్యాల చెంత పలకరిస్తారు
శ్రీవల్లి రష్మిక, శ్రీమతి విజయ్ రష్మిక
కొండంత అండదండగా
చల్లదనం పంచే వెండి కొండ
ఆనందాల చెంగల్వ పూలదండ
గీతాగోవిందం పారవశ్యాల సంతకం
మా అభిమాన తార రష్మిక నటుడు దేవరకొండ విజయ్ గారితో 26వ తారీఖునాడు సప్తపది ఏడు అడుగులు వేస్తున్న శుభసమయంలో అక్షర శుభాకాంక్షలు…
డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ అధ్యాపకులు, పరిశోధకులు
ລ້. ລ້: 9949039175




