హెల్మెట్ బ్యాంక్ !!!


        హెల్మెట్ బ్యాంక్ ...  అవునా ...?  నిజంగా ఇది నిజం ! బ్యాంక్ .. బ్లడ్ బ్యాంక్ చూశాం గానీ ఇది కొత్తగా ఉంది  అని ఆశ్చర్యపోతున్నారా? మల్కాజ్ గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న 
ARRIVE ..ALIVE కార్యక్రమంలో భాగంగా నేరేడ్మెట్ కమిషనరేట్ ఆఫీసు ఎదుట హెల్మెట్ బ్యాంక్  ఏర్పాటు  చేశారు. మీరు బ్యాంకులో డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చిన విధంగానే అవసరమైనప్పుడు హెల్మెట్ తీసుకొని  ఒక రోజులో తిరిగి ఇచ్చివేయాలి.  హెల్మెట్ బ్యాంకు ముందు నుంచి హెల్మెట్ లేకుండా వెళ్తుంటే ఆపి హెల్మెట్  ధరించేటట్లు చేస్తారు.  24 గంటల లోపల వాహనదారుడు తన సొంత హెల్మెట్  కొనితెచ్చుకోవచ్చు. ప్రతి ద్విచక్ర 
వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేటట్లు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.   మల్కాజ్ గిరి ట్రాఫిక్  సర్కిల్ ఇనస్పెక్టర్ , స్టేషన్ హవుస్ ఆఫీసర్ నర్సింహ ఆధ్వర్యంలో హెల్మెట్ బ్యాంక్ నిర్వహించారు.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *