డాక్టర్ శ్రీలీల! సినిమాలో కాదు. నిజంగా ఇది నిజం. అందరూ డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను అని చెప్తుంటారు. డాక్టర్ కావాలనే తల్లి కోర్కెను తీర్చడానికి షూటింగ్ లకు, కాలేజీ చదువుకు మధ్య సమయం కుదుర్చుకుని అనేక సంవత్సరాల శ్రమ తరువాత ముంబాయి డి వై పాటిల్ యూనివర్సిటీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీన డాక్టర్ పట్టా పొందారు. పట్టుదలతో ఆమె సాధించిన ఈ ఘనతను చూసి సినీ అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
శ్రీలీల కన్నడ చిత్రం కిస్ తో 2019లో తెరంగేట్రం చేసింది. తెలుగులో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి, మరియు గుంటూరు కారం వంటి విజయవంతమైన చిత్రాలతో సహా పలువురితో నటించారు, ఆమె కన్నడ చిత్రం కిస్ తో అరంగేట్రం చేసి, ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. ఆమె నటించిన కొన్ని ప్రముఖ తెలుగు సినిమాలు: పెళ్లి సందడి (2021), ధమాకా (2022), ఎక్సట్రార్డినరీ మ్యాన్ (2023), భగవంత్ కేసరి (2023), గుంటూరు కారం (2024). కన్నడలో భారతే , బై టూ లవ్ చిత్రాలలో నటించింది.
శ్రీలీల తదుపరి చిత్రాలు : మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి, జూనియర్ వివిధ దశల్లో ఉన్నాయి .
అమెరికాలోని ఒక తెలుగు కుటుంబంలో 2001 జూన్ 14న జన్మించిన శ్రీలీల బెంగళూరులో పెరిగారు. శ్రీలీల 2022 ఫిబ్రవరిలో గురు, శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. అనాథాశ్రమంలో వారిని చూసి చలించి శ్రీలీల ఇలా పసి పిల్లలను చేరదీయడం ప్రశంసనార్హం.




