చెన్నై జట్టుకు రెండవ గెలుపు


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో సక్సెస్ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన ఈ సీజన్ 22వ మ్యాచ్ ను సిఎస్ కె కైవసం చేసుకుంది. టాస్ గెలిచి కోల్ కతా జుట్టు బౌలింగ్ ఎంచుకుంది. సంజూ శాంసన్ _ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్ గా వచ్చారు. సంజూ 48, రుతురాజ్ 7 పరుగులు చేశారు. తర్వాత మాత్రే 38 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో రెండు జట్లలో బ్యాటర్ లు ఎవ్వరూ 50 పరుగులు చేయలేదు. చెన్నై 192 స్కోర్ చేసింది. 200 దాటుతుందని అనుకున్నారు. అయితే ఇది కూడా మంచి స్కోరే. తన ముందున్న 193 పరుగుల టార్గెట్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఛేదించలేక పోయింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతాకు ఇది 5వ మ్యాచ్. వీటిలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది.
ఈ సీజన్ ఆరంభంలో ఓటములతో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. అంతకు ముందు హోం పిచ్ లో కొన్ని మ్యాచ్ లలో ఓటమిని ఎదుర్కొన్న చివరకు చెన్నై సొంత గడ్డ మీద నెగ్గింది. 32 పరుగుల తేడాతో కెకెఆర్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో సంజు, ఆయుష్ మహత్రే, ట్రెవిస్ మెరుపులు కురిపించారు. శాంసన్ బౌండరీలతో రెచ్చిపోయాడు.
ఇంక బౌలింగ్ లో నూర్ అహ్మద్ రెచ్చిపోయి కోల్ కతా బ్యాట్స్ మెన్ కు చెమటలు పట్టించాడు. కేవలం 21 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంక బ్యాటింగ్ తో పాటు చెన్నై ఫీల్డింగ్ కూడా అదిరింది. ఇదివరకు మ్యాచ్ లలో ఫీల్డింగ్ లూజ్ గా ఉండేది. ఈ మ్యాచ్ లో చాలా టైట్ చేశారు. కోల్ కతా బ్యాటర్లు చాలావరకు సింగిల్స్ తోనే సరిపెట్టుకున్నారు. అప్పుడప్పుడు మాత్రమే బంతిని బౌండరీ దాటించే అవకాశం వచ్చింది.ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో 8వ ప్లేస్ కు రాగా, కోల్ కతా నైట్ రైడర్స్ చిట్ట చివరి స్థానంలోనే (10వ ప్లేస్) ఉండిపోయింది.

  • నిడమర్తి.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *