చేనేత సహకార సొసైటీలకు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల పాలక మండలుల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది.
రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలలో దాదాపు 69వేల మంది సభ్యులుగా ఉన్నారు. యాభై
మందికన్నా తక్కువ సభ్యులున్న సంఘాలలో చేతులెత్తే పద్ధతిలో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు.
ఆ విధంగా ఎన్నికైన డైరెక్టర్ల నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ని ఎన్నుకుంటారు.
మిగిలినవారు డైరెక్టర్లుగా పాలకవర్గం ఉంటుంది. చిన్న అంటే 50 మందికన్నా తక్కువ మంది
సభ్యులున్న సంఘాలలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట
తాలూకా మునిపంపుల, జనంపల్లి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. మునిపంపుల
చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా వనం వాసుదేవులు, ఉపాధ్యక్షులుగా జెల్ల రామదాసు ,
కార్యదర్శిగా గంజి సిద్ధప్ప, కోశాధికారిగా సంగిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్లుగా మిరియాల రామకృష్ణ,
కోణం పాండు, గంజి లక్ష్మీ నారాయణ, కర్నాటి రేణుక, సుంకి అమృతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనంపల్లిలోని
రెండు సంఘాలకు కూడా ఎన్నికలు జరిగాయి. శ్రీ వేంకట రమణ చేనేత సహకార సంఘానికి జరిగిన
ఎన్నికలలో అధ్యక్షుడుగా వనం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడుగా ఎక్కాలదేవి నర్సింహ, కార్యదర్శిగా సంగిశెట్టి గోవర్ధన్,
కోశాధికారిగా కైరంకొండ సరిత, డైరెక్టర్లుగా సంగిశెట్టి ధనుంజయ, సంగిశెట్టి భిక్షం, కర్నాటి నర్సింహ, కైరంకొండ
శ్రవణ్ కుమార్, సంగిశెట్టి అనిత ఎన్నికయ్యారు. శ్రీ మార్కండేయ సిల్క్ చేనేత సహకార సంఘం పాలకమండలి
సభ్యులు: అధ్యక్షులుగా సంగిశెట్టి సుదర్శన్, ఉపాధ్యక్షులుగా సంగిశెట్టి విజయలక్ష్మి, కార్యదర్శిగా వనం శంకర్,
కోశాధికారిగా పున్న శ్రీధర్, డైరెక్టర్లుగా కర్నాటి రమేష్, కైరంకొండ భిక్షం, సంగిశెట్టి గణేష్, సంగిశెట్టి కలమ్మ, సూరేపల్లి
మహాలక్ష్మి ఎన్నికయ్యారు. రెండు సంఘాల పాలక మండలి సభ్యులు ఆదివారం పదవీ స్వీకార ప్రమాణాలు చేశారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *