జనవరి చివరి వారంలో నాలుగు రోజులపాటు జరిగిన మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రశాంతంగా ముగిసింది.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లుచేసిన ఈ జాతరకు జనం కోట్లాదిగా తరలి వచ్చారు. స్కూళ్ళకు పండగ సెలవులు రావడంతో అసలు జాతరకు దాదాపు నెల రోజుల ముందునుంచే మేడారం సందర్శనకు జనం రాకడ మొదలైంది.హుండీలలో కానుకలతో పాటు జనం నిలువెత్తు బంగారం (బెల్లం)కూడా వనదేవతలకు సమర్పించుకున్నారు.భక్తులు కానుకలు సమర్పించిన హుండీలనుహనుమకొండకు తరలించి గట్టి భద్రత మధ్య లెక్కించారు.నలిగిన,పసుపు కుంకుమలు అంటిన కరెన్సీ నోట్లను శుభ్రం చేసి లెక్కించారు.మొత్తం మీద మేడారంలో ఉంచిన హుండీల లెక్కింపు పూర్తయ్యింది.మొత్తం 828 హుండీలను అధికారులులెక్కించారు.రూ.12 కోట్ల 64 లక్షల రూపాయలు కానుకలు వచ్చాయి.విచిత్రం ఏమిటంటే 2024 జాతరతో పోల్చితే ఈ సారి తక్కువ మొత్తంలో భక్తులు కానుకల వేశారు.2024 జాతరలో 540 హుండీలలో రూ.13 కోట్ల 25 లక్షల మొత్తం భక్తుల నుంచి కానుకలు రూపంలో వచ్చాయి.





