కాప్రా (హైదరాబాద్) : యువత తాము చదువుకున్న చదువును ఆచరణ యోగ్యంగా మార్చే శిక్షణ అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ కాప్రా సర్కిల్ లోని భావనానగర్ (పద్మశాలి టౌన్ షిప్) లో ఓపెన్పిక్సెల్ అకాడమీ ప్రారంభమైంది. ఓపెన్పిక్సెల్ అకాడమీ విద్యార్థులు, స్నేహితులు, క్లయింట్లు, కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం విజయవంతంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని సంస్థ స్థాపకుడు, డైరెక్టర్ అరవింద్ గుండేటి, మేనేజింగ్ డైరెక్టర్ దీప ఏముల నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన అతిథులు సంస్థ అందిస్తున్న సేవలను అభినందించారు.
యువత భవిష్యత్తులో స్పష్టమైన వృత్తిని ఎంచుకోవడం ద్వారా జీవన ప్రగతిని సాధించడానికి అవసరమైన అనుభవపూర్వక నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రోదిచేయడం ద్వారా పరిశ్రమ భావి అవసరాలతో సరితూగే నిపుణులను, వ్యాపార దక్షతగల యువతను తీర్చిదిద్దడం , సమాజ అభివృద్ధికి తోడ్పడే పరిపూర్ణ వ్యక్తులను తయారుచేయడం సంస్థ ప్రధాన ధ్యేయమని వ్యవస్థాపకుడు అరవింద్ గుండేటి ప్రకటించారు. యువతను భావితరం నిపుణులుగా తీర్చిదిద్దడం తమ సంకల్పమని తెలిపారు.
ఇప్పుడు తరగతి గదిలో సాగే బోధన సిద్ధాంతపరంగా సాగుతుండటంతో చాలామంది యువత ఉద్యోగ అవసరాలకు తగిన విధంగా రూపొందడం లేదని, ఆ లోటు పూరించే ఉద్దేశంతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రియల్‌టైమ్, జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను అకాడమీ అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఓపెన్పిక్సెల్ ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ఉద్యోగ గ్యారంటీ’ ద్వారా 15 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే 6 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన సీట్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఓపెన్పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
అకాడమీ అందించే ముఖ్యమైన శిక్షణా కోర్సులలో
- ఫుల్ స్టాక్ డెవలపర్ ట్రైనింగ్
- ఫుల్ స్టాక్ డిజైనర్ ప్రోగ్రామ్
- సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్
- మెంటర్షిప్ , కెరీర్ గైడెన్స్
- ఏఐ ఆధారిత టెక్నాలజీ మరియు డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ వంటివి ఉన్నాయి.
ఈ కోర్సులను రియల్‌టైమ్ ప్రాజెక్టులు, ప్రాక్టికల్ అనుభవం, మరియు వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టితో రూపొందించారు. ఆసక్తి ఉన్నవారు ఓపెన్ పిక్సెల్ అకాడమీ, పద్మశాలి టౌన్షిప్, భావనానగర్, కాప్రా, హైదరాబాద్ లో సంప్రదించవచ్చు.
ఫోన్: +91 88862 88553 ; వెబ్సైట్: www.openpixelacademy.com














