ఐదు రూపాయలకే డాక్టర్ సేవలు

ఏ ప్రభుత్వమైనా సంక్షేమం అంటే ఉచిత విద్య, వైద్యం అందించడానికి ప్రయత్నిస్తుంది.అదే ఒక ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఏలూరి హాస్పిటల్ లో దాదాపు ఉచితంగా కేవలం ఐదు రూపాయల ఫీజుతో మనం నిత్యం బాధపడుతున్న అనారోగ్య సమస్యలకు డాక్టర్ పరీక్షలు చేస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8-10 మధ్య డాక్టర్ చూస్తారు. అదే విధంగా అన్నిరకాల వ్యాధులకు చికిత్స, ఆపరేషన్ చేస్తున్నారు. రోగ నిర్ధారణకు జరిపే పరీక్షల ఫీజులో 25 శాతం రాయితీ ఉంటుంది. మందుల ఖరీదులో 15 శాతం రాయితీ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కాప్రా సర్కిల్ దమ్మాయిగూడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏలూరి హాస్పిటల్ లో రీ హాబిలిటేషన్ & డే కేర్ తో పాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్ల కోసం నర్సింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 040-27132713 లేదా 9703813713 నెంబర్లలో సంప్రదించవచ్చు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి అనుబంధంగా శ్రీ దిశా డయాగ్నస్టిక్ సెంటర్ ఉంది. సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ శతృజ్ఞ కిడాంబి పర్యవేక్షణలో వివిధ రకాల స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *