పెళ్లయ్యింది …! ప్రేమ విందుకు వేళయ్యింది

ఎనిమిదేళ్ల ఎదురుచూపులు …మూడు రోజుల వేడుకల ముచ్చట తరువాత ‘గీతగోవిందం’జంట విజయ్ దేవరకొండ -రష్మిక మందాన గురువారం ఒక్కటయ్యారు. సరస్సుల నగరం ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వారి వివాహం జరిగింది. ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న విలాసవంతమైన రిసార్ట్ ఇది. పెళ్ళికి ముందు జరిగే సంగీత్, హల్దీ వేడుకలకు సన్నిహిత బంధు మిత్రులు హాజరయ్యారు. పెళ్లి జరిగిన వేదిక జనసందోహానికి దూరంగా ఉదయపూర్ లోని ఏకాయ ప్రాంతంలో ఉంటుంది. వారిద్దరూ దక్షిణాదికి చెందిన తెలుగు, కొడవ సంప్రదాయాలకు చెందినవారు కావడం వల్ల ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరిగాయి. పెళ్లి వేడుకల చిత్రాలను కొత్త జంట అభిమానులతో పంచుకున్నారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *