సాకేత్ కాలనీలో త్యాగరాజ ఆరాధన


సంస్కార భారతికి అనుబంధంగా ఉన్న సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆవరణలో ఉన్న కళ్యాణ్ ఆంఫి థియటర్ లో వసంతోత్సవం 2026లో భాగంగా శుక్రవారం కళోత్సవం తొమ్మిదవ రోజు ఆధ్యాత్మిక భావనను పెంపొందించే విధంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. తరువాత త్యాగరాజ ఆరాధనోత్సవం జరిగింది. తొమ్మిది రోజుల కళోత్సవంలో రోజుకో కళారూపాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన సంస్కార భారతి బృందం ముగింపుగా త్యాగరాజ ఆరాధనోత్సవం జరపడం విశేషం. ఆరాధనలో వివిధ సంగీత వాయిద్యాలతో దాదాపు అరవై మంది కళాకారులు పాల్గొన్నారు.

యాప్రాల్ హాబీటాట్ రాయల్ సొసైటీలో
హాబీటాట్ రాయల్ అపార్ట్మెంట్ సముదాయంలో శుక్రవారం శ్రీరామ నవమి కళ్యాణం అత్యంత వైభవంగా, దివ్యంగా జరిగింది. గత రెండు రోజులుగా సొసైటీ ప్రముఖులు అందరూ కలసికట్టుగా చేసిన పకడ్బందీ ఏర్పాట్లు కార్యక్రమం సజావుగా పూర్తి కావడానికి తోడ్పడ్డాయి. నివాసితులందరూ విరాళాలు ఇవ్వడమే కాక స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి
ఏర్పాట్లలో పాల్గొన్నారు. కళ్యాణం తరువాత విందు జరిగింది. సాయంత్రం బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు, తదనంతరం సొసైటీ చుట్టూ మూడుసార్లు సీతారాముల ఊరేగింపు జరిగాయి. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *