సైనికపురి శంకరమఠంలో శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు

సైనిక్ పురి శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలోని శ్రీ విజయగణపతి దేవాలయంలో
ఆదివారం 11 అక్టోబర్ నుంచి శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజు హైదరాబాద్ శ్రీ శాంకరీ మహిళా బృందం వారిచే శ్రీమతి సుధారాణి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సౌందర్య లహరి, శ్రీ లలితా సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల సామూహిక పారాయణంతో పాటు కుంకుమార్చన జరిపారు. 11వ తేదీ నుంచి 21వ తేదీ బుధవారం వరకు నిత్య కుంకుమార్చన, చతుర్విద పారాయణం, విశేష హోమాలు, శత చండీయాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ మహాసన్నిధానం వారు , జగద్గురు శ్రీ సన్నిధానం వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గణపతి అధర్వ శీర్ష పారాయణ, చతుర్వేద పారాయణ, సప్తశతి, దేవీ భాగవతం, లలిత , పంచదళాక్షరీ జపం, మహా విద్య, అరుణం వంటి అనేక కార్యక్రమాలు/ పూజలు ఉంటాయి. నవరాత్రి కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిరంతరం కాపాడాలని వారి వారి గోత్ర నామాలతో సంకల్పం చెప్పి శృంగేరి జగద్గురువుల పరిపూర్ణమైన దివ్యాశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. పూజ రుసుమును ఆన్ లైన్ లో కూడా పంపవచ్చు. విరాళాలిచ్చిన దాతలకు , నవరాత్రి పూజా రుసుము కట్టిన భక్తులకు కూడా అదేరోజు ప్రసాదాలతో పాటు రాత్రి 9 గంటలకు
అన్న సంతర్పణ ఉంటుంది. ఈ ప్రసాద వితరణలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. ఫోన్ పే / గూగుల్ పే –9394566676 వాట్సాప్ –7207216610

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *