
తెలుగు సినిమా పరిశ్రమ సృజనకు స్వాగతం పలుకుతోంది నవతరం దర్శకుల భావసంపద వలన కొత్తదనం తెరపై పరవళ్లు వే స్తోంది. ఇటీవల సినిమాల్లో రక్తపాతం, హింస ఎక్కువగా కనిపిస్తోంది అన్న విమర్శ వినపడుతున్న నేపథ్యంలో కుటుంబ పరమైన భావోద్వేగాలు ఆశయం ఆశ జతగా కలిసిన కథనంతో ఆకాశంలో ఒక తార చిత్రం ప్రేక్షకులు తీర్పుకోరుతూ వచ్చింది. అంతరిక్షానికి వెళ్లాలనే ఒక పల్లెటూరి యువతి కథ ఈ చిత్రం. కల్పనా చావ్లాను స్ఫూర్తిగా తీసుకొని బాల్యం నుంచి అంతరిక్షానికి వెళ్లాలనే
కోరిక ఆమెలో రోజు రోజుకు పెరుగుతుంది. అయితే అనుకోకుండా చిన్నతనంలోనే వివాహం జరుగుతుంది. కథానాయకుడు ఆమె ఆశయానికి అండగా నిలుస్తారు. ఆమె చిరకాల ఆకాంక్ష అయిన వ్యోమగామిగా చేయడానికి ఎలా ప్రయత్నించారు అనే కథని వెండి తె రపై చూస్తే బాగుంటుంది ఇటువంటి కథనాలని ప్రేక్షకులు తెరమీద వీక్షిస్తే మనసుకి అనుభూతి కలుగుతుంది చిత్ర కథనం అంతా కల్పన, కృష్ణ పాత్రలు చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరి మధ్య నడిచే దృశ్యాలు మనస్సుని సృష్టిస్తాయి. ఒక ఆశ, ఆశయం అనే విత్తనం మహావృక్షంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా అండదండలు అవసరం అలాగే భార్య ఆశయ సాధనకు అది ఫలించే వరకు పరిశ్రమించిన భర్త కథ . సినిమా కూడా ఈ దృశ్యాలతోటి ప్రారంభమవుతుంది. తోడు నీడ అనే పదానికి నిజమైన అర్ధం మనం కథానాయకుడి పాత్రలో మనం సందర్శించవచ్చు. ఒక దశలో ఆశయానికి దూరం అవుతున్న భార్యను సరైన మార్గంలో నడిపించిన భర్త పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. దర్శకుడు పవన్ కథలో భావోద్వేగాలని జతచేసిన తీరు చాలా బాగుంది. చిత్రంలో అందరికన్నా అభినందనలు చేరవలసింది మహానటి, సీతారామం , లక్కీ భాస్కర్ చిత్రాల ద్వారా తెలుగు వారికి చేరువైన దుల్కర్ సల్మాన్ అభినయానికి హీరోయిన్ వీరవల్లి సాత్విక నటనకి మంచి మార్కులు వచ్చాయి చిత్రంలో వర్ధమాన తారలు కూడా ఉన్నారు శృతిహాసన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించరు. చిత్రమంతా రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరిగింది . జి. వి. ప్రకాష్ సంగీతం శ్రీమణి సాహిత్యం బాగున్నాయి ఒక ఆశయం కోసం పరితపించే వారికి విద్యార్థులకు ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
— డాక్టర్ దువ్వూరి శర్మ, పరిశోధకులు, 99490 39175.





