స్వచ్ఛమైన బాల్యం

నవంబర్ 14 బాలల పండుగ.

     నవంబర్ 14 బాలల పండుగ.   మన దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు.వ్యక్తిగా గంభీరంగా ఉన్నా పసి హృదయాలను నెహ్రూ ఆరాధించేవారు. బాల్యం అందమైనది. అది ఎప్పుడు తిరిగిరాని మధురమైన జ్ఞాపకం. ఎంత ఎదిగిగా మనిషి మనస్సు బాల్యం దగ్గర ఆగిపోతుంది. ఆజన్మాంతమైన అనుభూతి. జీవన చక్రం ఎంత వయసు దూరం ప్రయాణించినా బాల్య స్మృతులు వద్దే నిలిచి స్మరిస్తుంది అది ఎవరికైనా సహజం ఒక్కసారి బాల్యం సంగతులని మనం తలుచుకున్నప్పుడు అవన్నీ మనసుకు దగ్గరైన పరిచయాలుగా అనిపిస్తాయి. ఊహ పెరిగిన తరువాత తర్వాత బాల్యం మనల్ని ప్రపంచానికి సన్నిహితం చేస్తుంది మూడేళ్ల వయసు నుంచి 12 వసంతాల వరకు బాల్యంగా నిర్వచిస్తారు ఈ వయసులో మనసు చిన్న చిన్న సంతోషాలకి సంబరపడిపోతుంది అవి మనస్సు అల్మారాలో దాచుకుని వయసు పైబడిన అవి ఆజరామరంగా ఉండడం విశేషం బాల్యంలో వర్షం లో తడవడం, చినుకుల స్పర్శకు పరవశించడం, కాగితపు పడవలు వదలడం రంగుల్ని ఉపయోగించి చిత్రాలను సృష్టించడం, సాయం సంధ్యలో భారతీయ క్రికెట్ బృందల్లా భావించి క్రీడలు ఆడడం , దొంగతనంగా మామిడిపళ్ళ రుచిని ఆస్వాదించడం, అలసిపోయిన శరీరాన్ని సేదతీర్చేందుకు కాలవల్లో స్నానాలు ఇవన్నీ ఒకప్పటివరకు. వేదన కలిగించే విషయం ఏమిటంటే ఇప్పుడు బాల్యం బరువుగా మారిపోయింది అలసిపోయిన తనువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలు వాతావరణం విశ్రాంతి లేని అధ్యయనాలు జీవితాశయం కోసం చిన్నతనం నుంచి పరుగులు పోటీ ప్రపంచం నింపిన స్వార్థం విలువలు అందించని విద్య చరిత్ర నేర్పిన సాంకేతికత మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలకి ప్రాధాన్యం ఇది ఇప్పటి బాల్యం పరిమళించిన సొంతంగా మేఘం వయ్యారంగా వడ్డించిన ఇంద్రధనస్సులా వర్షం గిలిగింతలా దాచుకున్న నెమలి పించం అందంలా , అమ్మ చేతి ఆవకాయ ముద్దలా గోమాత క్షీరంలా , వేణు రాగంలా , వీణా మాదిరిలా వెండితెర కమ్మని కావ్యంగా సీతాకోకచిలుక పలకరింపులా అంతకుమించి కష్టాలు కన్నీళ్లు తెలియని జీవనంలో బాల్యం ఆశల తెరకి తలుపులు తెరవాలి.
-- డాక్టర్ దువ్వూరి శర్మ, పరిశోధకులు, 99490 39175.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *