
ప్రపంచంలో తెలుగు సినిమాని మరింత కీర్తిదాయకంగా, భావోద్వేగాలపరంగా పరిచయం చేసిన దర్శక ధీరుడు మన రాజమౌళి సినిమా ప్రయాణం మొదలై 25 వసంతాలు అయింది. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి వారణాసి వరకు ప్రతి సినిమా భావోద్వేగాల గ్రంధం. తెలుగు సినిమా భావోద్వేగాల పరిశోధనలో భాగంగా వారి సినిమాలని అధ్యయనం చేసే అవకాశం వ్యక్తిగతంగా కలిగింది. రాజమౌళి శాంతినివాసం టీవీ సీరియల్ ద్వారా కథకులుగా, దర్శకులుగా అందరికీ దగ్గరైనారు. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో ఒక కుటుంబ కథకి సరికొత్త అంశాలని జత చేర్చారు నటుడుగా జూనియర్ ఎన్టీఆర్ కి విజయం అందించారు. ప్రేమ, రౌద్రం విచారం ఇలా పలు భావోద్వేగాలు తెరమీద నడిచాయి. చిత్రం విజయం సాధించినా , దర్శక పర్యవేక్షణ నిర్వహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఆ మేరకు క్రెడిట్ ఇచ్చారు. సింహాద్రి చిత్రాన్ని తాను పుట్టి పెరిగిన గోదావరి తీరంలో తర్వాత కేరళలో అందంగా మలిచారు . చిత్రమంతా ఎవరు ఊహించని రీతిలో ఉంటుంది. ఎన్టీఆర్ ని రెండు కోణాలలో ఆవిష్కరించారు. ఇంకా భూమికను అమాయకంగా చిత్రీకరించారు. పాటల విషయానికి వస్తే ‘ ‘నేను విజిలెస్తే ‘ పాట ఇప్పటికీ ప్రేక్షకులకు మరచిపోనివ్వదు. చిత్రంలో అలా ఉద్వేగాలు చివరి వరకు నడిపించాయి. గోదావరి పుష్కరాల సమయంలో 2003లో ఈ సినిమా సంచలనంగా నిలిచింది . ఒక చిన్న పాప కథని నిజాయితీపరుడైన తండ్రి ప్రేమని కలిపి రెండో పాత్రలో ఒక వ్యక్తి పాపను ఎలా స్వీకరించారు అనే అంశాన్ని అందరికీ నచ్చేలా విక్రమార్కుడులో తీశారు. రవితేజలో ఉన్న ఎనర్జీని వెలికి తీశారు. అనుష్క పాత్రని అల్లరిగా చిత్రీకరించారు కోపం భయం ప్రేమ హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు కనపడ్డాయి. రగ్బీ క్రీడ గురించి అందరికీ పరిమితంగా తెలుసు. సై చిత్రం ద్వారా రెండు విద్యార్థుల బృందాల మధ్య వైరాన్నీ, చివరికి వారందరూ శత్రువు మీద పోరాడే స్థితిని భావోద్వేగాలపరంగా వెండి ధర మీద అందించారు. మరొక చిత్రం ‘ఈగ’ లో కథానాయకుడు సినిమాలో కనిపించేది కేవలం 48 నిమిషాలే . తర్వాత ప్రతీకారం కోసం ఈగగా అవతరిస్తాడు. సాంకేతికతకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందేవిధంగా బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించారు. ఈ చిత్రం అచ్చమైన చందమామ కథలా తీర్చిదిద్దారు. కథ , కథనాలు అందరికీ నచ్చాయి. ఇద్దరు వ్యక్తుల మానసిక సంఘర్షణలు, రాజవంశీయులు కుట్రలు ప్రేక్షకులను మూడు గంటల పాటు కట్టిపడేస్తాయి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నాజర్ పాత్రలు వెండితెరపై చిరస్మరణీయంగా ఉండేలా సంతకం చేశాయి. పచ్చబొట్టు పాట దర్శకేంద్రుని స్టయిల్లో తీశారు. హంసల పాట సూపర్. మగధీర చిత్రం పునర్జన్మల ఇతివృత్తం . రాంచరణ్ కు మంచి ఇమేజ్ అందించింది. నిజంగా ఇలాంటి కథనాలని ప్రేక్షకులు చేత అంగీకరింపజేయడం ఒకరకంగా సాహసం. జూనియర్ ఎన్ఠీఆర్ రాజమౌళిని ప్రేమతో జక్కన్న అని సరదాగా పిలుస్తారు . సంచలన విజయాలు సాధించిన నిరాడంబర వ్యక్తిత్వం ఆయనది. సాధారణంగా ప్రచారానికి దూరంగా రాజమౌళి ఉంటారు. కుటుంబ విలువలని ప్రేమిస్తారు అనుకరిస్తారు తన దర్శక బృందంలో ఎక్కువమంది కుటుంబ సభ్యులు ఉంటారు విజయేంద్ర ప్రసాద్, కీరవాణి, శ్రీవల్లి , రమ ఇలా అందరూ ఒక బృందంగా ఉంటారు రాజమౌళి వెండి ధరకు పరిచయమై 25 వసంతాలు అయింది. మహాభారతం నిర్మించాలని ఆయన ఆశ. అది ఫలించాలని అభిలషిస్తూ శుభాకాంక్షలు .
— డాక్టర్ దువ్వూరి శర్మ , సినీ పరిశోధకులు, 9949039175





