సొంతగడ్డపై గెలుపుతో సన్ రైజర్స్ పండగ

          సన్ రైజర్స్ అభిమానులు కలకాలం గుర్తుంచుకునే మ్యాచ్ సోమవారం సొంతగడ్డపై జరిగింది.  వరుస విజయాలతో టాప్ లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అపూర్వ విజయం సాధించింది. ఇటీవల ఓటములతో సతమతమవుతున్న హైదరాబాద్ జట్టుకు ఈ గెలుపు పెద్ద ఊరట.టాటా ఐపీఎల్ 2026లో వరుసగా నాలుగుసార్లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ఆర్. ఆర్.ను సన్ రైజర్స్ జట్టులోని కొత్త కుర్రాళ్ళు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇద్దరికీ ఇదే మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్ లో ప్రఫుల్ మొదటి ఓవర్ లోనే మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ బ్యాటర్ లను పెవెలియన్ దారి పట్టించాడు. ఇంకా ఘోరమైన విష్యం ఏమిటంటే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దయనీయ స్థితిలో పడింది. సన్ రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24కు 4 వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ జట్టు రాజస్థాన్ పై 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం హైదరాబాద్ ఆటగాళ్ల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్ఠానికి 216 రన్స్ చేయగా, రాజస్థాన్ జట్టు 159 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. రాజస్థాన్ జట్టులో తుషార్ 1, పరాగ్ 1, అక్సర్ 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ మొదట్లో తడబడింది. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే అభిషేక్ అవుటయ్యాడు. ఆరంభం అభిమానులను నిరాశపరిచింది. కానీ తర్వాత హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఇషాన్ కిషన్ - క్లాసెన్ భాగస్వామ్యంలో 100 కు పైగా రన్స్ చేసి స్కోరును అమాంతం పెంచేశారు. ఇషాన్ సెంచరీ చేస్తాడని ఆశించారు కానీ 91 రన్స్ కే ఔటయ్యాడు. క్లాసెన్ 40 పరుగులు చేశాడు. హుస్సేన్ బౌలింగే కాక బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. మొదట్లోనే 9 పరుగులకు 5 వికెట్లు పోగొట్టుకుని కుదేలైన రాజస్థాన్ రాయల్స్ జట్టును జడేజా 45, ఫెరీరా 69 పరుగులు చేసి ఆదుకున్నారు.    --ఎన్ ఆర్  ఎస్.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *