ఆర్ సి బి దాడిలో లక్నో చిత్తు

రసిక్ — 4/24

==
ఐపీఎల్ 2026 సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బుధవారం జరిగిన మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్రభాగాన నిలిచింది. ఈ సీజన్ ఐపీఎల్ 23వ మ్యాచ్ బుధవారం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ (ఎల్.ఎస్.జి) జట్టు చాలా మందకొడిగా ఆడింది. 13 ఓవర్లలో 94 రన్స్ కు 4 వికెట్లు పోగొట్టుకుంది. రన్ రేట్ చాలా తక్కువగా 7.31 మాత్రమే. లక్నో జట్టులో బాదోని కాస్త నిలబడి ఆడాడు. అతను ఔటయ్యాక మిగతా వికెట్లు త్వరగా పడిపోయాయి. షమీ రన్స్ చేయకుండానే ఔటయ్యాడు. ఆర్.సి.బి. బౌలర్ భువనేశ్వర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. లక్నో బ్యాటర్ ముకుల్ సిక్స్ కొట్టిన వెంటనే 39 దగ్గర ఔటయ్యాడు.
బెంగళూరు బౌలర్ రసిక్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. లక్నో స్కోర్ 148. విరాట్ కోహ్లీ, సాల్ట్ ఓపెనర్స్ గా వచ్చారు. కోహ్లీ 49 రన్స్ చేసి ఔటయ్యాడు. ఒక్క రన్ చేస్తే 50 అయ్యేది. ఆర్.సి.బి. బౌలర్ భువనేశ్వర్ 27 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. హేజల్ వుడ్ 1, కృనాల్ 2 వికెట్లు తీశారు. లక్నో ఈ సీజన్లో ఇంతవరకూ 5 మ్యాచ్ లు ఆడింది.మూడింటిలో ఓడి, రెండింటిలో మాత్రమే గెలిచింది.
బెంగళూరు జట్టు ఈ సీజన్లో ఇంతవరకూ 5 మ్యాచ్ లు ఆడింది. 4 గెలిచింది. పట్టికలో టాప్ పొజిషన్లో ఉంది.

–ఎన్ ఆర్ ఎస్

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *