కోల్ కతాకు తొలి విజయం


ఐపీఎల్ లో పంజాబ్ కు ఎదురు లేదు, కోల్ కతాకు గెలుపు లేదు అని నిన్నటిదాకా అనుకున్నారు. కానీ చివరకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఆదివారం జరిగిన మ్యాచ్ లో గెలిచింది. ఆదివారం 19వ తేదీన రెండు ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 వరకు కోల్ కతా లో కెకెఆర్) _ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్.ఆర్.పై కెకె ఆర్ విజయం సాధించింది. ఇంతవరకూ 6 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ 5 మ్యాచ్ లలో ఓడింది. ఒకటి రద్దయింది. పాయింట్స్ టేబుల్ లోకేకేఆర్ చిట్టచివర ఉంది . ఆదివారం మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీం రాజస్థాన్ రాయల్స్ (ఆర్.ఆర్) పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోల్కతా పరాజయం దిశగా వెళ్తూ చివరకు నిలదొక్కుకుని గెలుపు సాధించింది. ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 85 స్కోర్ సాధించి కెకె ఆర్ ఓటమి దిశగా వెడుతోంది. ఆ టైంలో రింకూ, అనుకూల్ స్కోరును పరుగెత్తించారు. మరో వైపు కోల్కతా బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించారు. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ జట్టు పెట్టిన 156 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్నారు.
బ్యాటర్ రింకూ సింగ్ 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనుకూల్ 29 రన్స్ తో నాటౌట్ గా ఉన్నాడు.
కేకేఆర్ బౌలర్లు జడేజా 2, కార్తీక్ త్యాగి 3, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ స్కోరు పెరగకుండా కట్టడిచేశారు. రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది. ఆ జట్టులో వైభవ్ సూర్య వంశీ 46, యశస్వీ జైస్వాల్ 39 పరుగులు చేశారు. ఆర్. ఆర్. ఇచ్చిన టార్గెట్ అంత పెద్దదేం కాదు. ఆ టీం బౌలర్ జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్ మొదటి బాల్ తోనే కెకె ఆర్ బ్యానర్ సీఫర్ట్ ను ఔట్ చేయడం, రహానేను బర్గర్ ఔట్ చేయడంతో కెకె ఆర్ పికప్ అవుతుందా సంశయం కలిగింది.
ఆర్చర్ స్పెషాలిటీ: బుమ్రా, ఛాహల్, నూర్, జడేజా, రమణ్ దీప్ వంటి కొమ్ములు తిరిగిన బౌలర్లు ఉన్నా ఆర్చర్ కు ఓ స్పెషాలిటీ ఉంది. తన బౌలింగ్ మొదటి ఓవర్ లో మొదటి బాల్ కే ప్రత్యర్థి వికెట్ తీసుకోవడం ఆర్చర్ కు ఇది అయిదో సారి. రాజస్థాన్ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *