హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు గెలిచింది. హైదరాబాద్ టీమ్ కు ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ లో ఇది రెండవ గెలుపు. గెలుస్తుందా లేదా అని అనుకున్న మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ మెరిసినట్టే మెరిసి ఓడిపోయింది.
హైదరాబాద్ టీమ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, క్లాసెన్ బ్యాటింగ్ లో మెరుపులు కురిపించారు.
ఎస్సార్ హెచ్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మ ఓపెనర్స్ గా వచ్చారు. అభిషేక్ హెడ్ జంట బాగా ఆడారు. 10 రన్స్ తేడాతో చెన్నై పై హైదరాబాద్ నెగ్గింది. సన్ రైజర్స్ ఈ సీజన్లో ఇంతవరకూ 6 మ్యాచ్ లు ఆడింది. 3 గెలిచింది. 3 ఓడిపోయింది.
ఎస్సార్ హెచ్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ, క్లాసెన్ అద్భుతంగా ఆడారు. చెరి 59, 59 పరుగులు చేయడం విశేషం.
ఈ సీజన్లో మొదట పరాజయాలు మూటగట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ లో గ్రాడ్యువల్ గా పికప్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇంకా వెనుకబడే ఉంది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ మలింగ 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంక అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో కేవలం 15 బాల్స్ కు 50 రన్స్ చేయడం విశేషం. మరో బ్యాటర్ క్లాసెన్ ఈ సీజన్లో తన మూడో హాఫ్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ టీమ్ స్కోర్ 194/9. ఒకానొక దశలో సన్ రైజర్స్ రన్ రేటు 13.3 వరకు ఎగబాకింది.
హైదరాబాద్ బౌలింగ్ లో ప్రఫుల్ ఒకటి, నితీష్ కుమార్ రెడ్డి 2, సాకిబ్ హుస్సేన్ 1, మలింగ 3 వికెట్లు, నితీష్ 2 తీసుకున్నారు. పాయింట్స్ టేబుల్ లో హైదరాబాద్ నాల్గవ స్థానానికి వెళ్ళింది. చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్.కే) టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది.
సిఎస్.కె. బ్యాటింగ్ లో సంజు శాంసన్ , రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్ గా వచ్చారు.
చెన్నై ఈసారి కూడా గెలుస్తుందని మ్యాచ్ చూస్తున్న వాళ్ళు అనుకున్నారు. ఒకానొక దశలో 60 బాల్స్ కు 84 రన్స్ చేయాలి. ఈజీగా చేయవచ్చు అని ఎవరైనా చెబుతారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి సి ఎస్ కె బ్యాటర్లు తట్టుకోలేక పోయారు. ఆ జట్టుకు వరుసగా ఇది నాలుగో ఓటమి. లాస్ట్ ఓవర్ లో కూడా వికెట్ పోవడం చెన్నైకి గట్టి దెబ్బ. నిజం చెప్పాలంటే లాస్ట్ ఓవర్ రెండు జట్లకు చాలా కీలకంగా మారింది. విన్నింగ్ ఎడ్జ్ లో రెండు టీమ్ లూ టెన్షన్ తో ఆడాయి.
ఇక్కడో విషయం చెప్పాలి. బుమ్రాలాగా సాకిబ్ హూస్సేన్ బౌలింగ్ ను తట్టుకోవడం కూడా కష్టం. లాస్ట్ ఓవర్ లో చెన్నై వికెట్ పడగొట్టి మ్యాచ్ ను హైదరాబాద్ వైపు టర్న్ చేశాడు.
ఢిల్లీ చేతిలో ఆర్ సి బి ఓటమి
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఫాంలో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓటమిని చవి చూసింది. ఢిల్లీ రెండు డిఫీట్ ల తర్వాత గెలుపును అందుకుంది. బ్యాటర్ లు అద్భుతంగా ఆరు 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది.
మొదటి బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టులో విరాట్ కోహ్లీ, సాల్ట్ ఓపెనర్స్ గా వచ్చారు. సాల్ట్ 63, కోహ్లీ 19, మిల్లర్ 18 , పరుగులు చేశారు. కోహ్లీ ఎక్కువ రన్స్ తీయకుండా ఔట్ కావడంతో, పడిక్కల్ బాగా ఆడినా మ్యాచ్ మలుపు తిరిగింది.
ఢిల్లీ బౌలర్స్ ముకేష్ 1, ఎంగిడి 2, కుల్దీప్ 2, అక్షర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు స్కోర్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.
ఢిల్లీ కేపిటల్స్ ప్రారంభం ఓవర్లలో డిఫెన్స్ ఆగలేకపోయింది. 18 పరుగులకే 3 వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్స్ గా వచ్చిన వారిలో నిశాంక త్వరగా ఔటయ్యాడు. ఆ పరిస్థితిలో స్టబ్స్, రాహుల్ ఢిల్లీకి అండగా నిలబడ్డారు. రాహుల్ 57 రన్స్ చేసి ఔటయ్యాడు. స్టబ్స్ 60 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 3, కృణాల్ 1 వికెట్లు తీసుకున్నారు. ఢిల్లీ స్కోర్ 179కు చేరింది.
తాజాగా పాయింట్ల పట్టికలో బెంగుళూరు 8 పాయింట్ లతో రెండో స్థానంలో ఉంది. ఇంతవరకూ ఆడిన 6 మ్యాచ్ లలో ఆర్సీబీ 4 గెలిచి, 2 ఓడిపోయింది.ఢిల్లీ 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.
_ వి. మధుసూదనరావు.

