తెరపై పరిమళించిన కోనసీమ ప్రతిభ


*** గేదెల రాజు కాకినాడ తాలూకా

     సృజన కలిగిన సినీరంగం అందరిని సాదరంగా స్వాగతిస్తుంది. కోనసీమ ప్రాంతానికి సినీ రంగానికి మధ్య చాలా కాలం నుంచి నుంచి అనుబంధం ఉంది.   ఎందరో నటులు, దర్శకులు, రచయితలు, పరిశోధకులను  కోనసీమ ప్రాంతం చిత్ర సీమకు అందించింది. మూడు దశాబ్ధాల క్రితం తెలుగు సినిమా పాటలపై డాక్టర్ పైడిపాల, రెండు సంవత్సరాల క్రితం తెలుగు సినిమా భావోద్వేగాల పై వ్యక్తిగతంగా ఈ సెమీక్షకుడు పరిశోధన చేసారు. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ చిత్రాల దర్శకులు ఈ ప్రాంతానికి చెందినవారే. ఇటీవల కాలంలో సినీ నటులుగా వెండితెర మీద మెరుస్తున్న సాయి శ్రీనివాస్ గారు కోనసీమ ప్రాంతానికి చెందినవారే.

 నేపధ్య గాయకులు, వ్యాఖ్యాత, సంగీత దర్శకులు కుంచె రఘు ప్రధాన పాత్రలో వచ్చిన గేదెల నూకరాజు చిత్ర దర్శకులు మోటూరి చైతన్య కోనసీమకే  చెందిన ఉప్పలగుప్తం నివాసి. వారి కుటుంబ సభ్యులు నిర్మాతలుగా వ్యవహరించి చిత్రాన్ని సమర్పించారు. చిత్రంలో ప్రేమ, భయం, కోపం, అసహ్యం వంటి  భావోద్వేగాలు   కథని నడిపించాయి. 

 చిత్ర దర్శకులు చైతన్య  సమర్ధవంతంగా కథని తెరమీద ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేలా చిత్రీకరించారు. కథ గతం వర్తమానం దృశ్యాలు మధ్య నడుస్తుంది.  ఒకరకంగా చిత్ర దృశ్యాలని తెరమీద ప్రదర్శించడంలో సీనియర్ దర్శకులు వంశీని అనుసరించారు అనిపించింది. గేదెలరాజు హత్యతో చిత్ర కథ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ భావత్రాసులో అటు ఇటు కదులుతూ ఉంటుంది. కథ, కథనంలో రెండు ప్రేమ కథలని జత చేశారు. సమీక్ష ధర్మం దృష్ట్యా కథను  వివరించడం లేదు. చిత్ర కథని వెండి తెరమీద చూస్తే బాగుంటుంది. 

చిత్రంలో అందరూ సగంపైగా వర్ధమాన తారలు నటించారు. కుంచె రఘు పాత్ర అందరికీ గుర్తుంటుంది. తెలుగు సినీ పరిశ్రమ ఆయన ప్రతిభని గుర్తించినప్పుడు రానున్న కాలంలో మంచి పాత్రలు రఘుకు లభిస్తాయి. సంగీత దర్శకులుగా అందరికి నచ్చే పాటలు అందించారు. పాటల రచయితగా  చక్కని అక్షర భావ సంపద అందించారు. కాకినాడ తెరమీద కొత్తగా కనిపిస్తుంది.

    దర్శకులు చైతన్య కృషి మనకు తెరమీద కనిపిస్తుంది.  ఎడిటింగ్ గురించి ఇంకా కొంచెం  శ్రద్ధ పెడితే బాగుండేది. అందరికి పరిచయం అయిన కాకినాడ ప్రాంతాన్ని కెమెరా కన్నుబాగా  చిత్రీకరించింది. దర్శకులు చైతన్య ప్రేమ, కుటుంబ కథలని తన అద్వితీయ ప్రతిభ ద్వారా అందరిని అలరిస్తొందని ఆశిస్తున్నాను. . గేదెల రాజు ఒక కొత్త ప్రయత్నం తప్పకుండా సినీ  అభిమానులు ఆదరించాల్సిన అవసరం ఉంది. కోనసీమ వాసి దర్శకులు చైతన్యకు , నిర్మాతలు అయిన వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు. 

డా. డి.వి.యస్.శర్మ, సినీ పరిశోధకులు, 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *