
ఈ ఐపీఎల్ సీజన్ మొదట్లో … ‘హైదరాబాద్ టీం ఏం ఆడుతుందిలే’ అనుకున్నారు. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్. ఆర్.కె) , పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టాప్ లేపింది. పంజాబ్ ను ఓడించి, ఇంతవరకూ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ గా ఉన్న పంజాబ్ ను పక్కన పెట్టి ఎస్సార్ హెచ్సా మొదటి స్థానం సాధించింది. అది కూడా సొంతం గడ్డ హైదరాబాద్ నగరంలో. పంజాబ్ హ్యాట్రిక్ ఓటమితో తోక ముడిచింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్:
బ్యాటింగ్ : అభిషేక్ శర్మ 35, హెడ్ 38, ఇషాన్ కిషన్ 55, క్లాసెన్ 69. నితీష్ కుమార్ రెడ్డి 29 (నాటౌట్). మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235. 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి చవిచూసింది.
బౌలింగ్: కమిన్స్ 2 , నితీష్ కుమార్ రెడ్డి 1, మలింగ 1, షకీల్ 1, శివాంగ్ 2 వికెట్లు తీసుకున్నారు.
ఎస్సార్ హెచ్ ఇంతవరకూ 11 మ్యాచ్ లు ఆడింది. 7 గెలిచింది. 4 ఓడింది. ఈ మ్యాచ్ తో నంబర్ 1 పొజిషన్ కు వచ్చింది.
పంజాబ్ ఇన్నింగ్స్: బ్యాటింగ్ లో చెప్పుకో దగ్గ విషయం కనోలీ 107 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కానీ జట్టు ఓడిపోవడంతో అతని సెంచరీ వృథా అయింది. స్టైనిస్ 28, సూర్యాంశ్ 25, యాన్సెన్ 19 రన్స్ చేశారు. మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది.
పంజాబ్ బౌలింగ్: అర్ష్ దీప్ 1, ఫెర్గూసన్ 1, రాహుల్ 1, వైశాక్ ఒక వికెట్ తీసుకున్నారు.
పంజాబ్ ఇంతవరకూ 10 మ్యాచ్ లు ఆడింది. 6 గెలిచింది. 3 ఓడింది. ఒక దాని ఫలితం తేలలేదు. ఇప్పుడు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి దిగింది.
.

చెలరేగిన సంజూ శాంసన్
ఢిల్లీలో మంగళవారం ఢిల్లీ కేపిటల్స్( డిసి) – చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్.కె) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై మరోసారి సత్తా చాటింది. ఢిల్లీపై గెలిచింది. చెన్నై బ్యాటర్ సంజూ శాంసన్ రెచ్చిపోయాడు. 87 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ విధించిన టార్గెట్ చిన్నదే కావడంతో గెలుపు ఈజీ అయింది.
ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్స్: బ్యాటింగ్ : నిశాంక 29, కె.ఎల్. రాహుల్ 12, నితీష్ రాణ 15, కరుణ్ నాయర్ 13, అక్షర్ 2, స్టబ్స్ 38, రిజ్వీ 40. మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155.
ఢిల్లీ బౌలింగ్: అక్షర్ 1, ఎంగిడి 1. ఢిల్లీ కేపిటల్స్ ఇంతవరకూ 10 మ్యాచ్ లు ఆడింది. 4 గెలిచింది. 6 ఓడింది. పాయింట్స్ టేబుల్ ఏడవ స్థానంలో ఉంది.
చెన్నై ఇన్నింగ్స్: బ్యాటింగ్: సంజూ శాంసన్ నాటౌట్ 87, రుతు రాజ్ గైక్వాడ్ 6, ఉర్విల్ 17, కార్తీక్ శర్మ 41 (నాటౌట్).
సంజూ, కార్తీక్ శర్మ కలిసి మూడో వికెట్ భాగస్వామ్యంలో 100 పరుగులకు పైగా చేశారు. మొత్తం 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఢిల్లీపై చెన్నై గెలిచింది.
చెన్నై బౌలింగ్: అకీల్ హోసిన్ 1, ముకేష్ 1, నూర్ అహ్మద్ 2, గుర్జప్ నీత్ 1, ఓవర్టన్ ఒక వికెట్ తీసుకున్నారు.
చెన్నై ఇంతవరకూ 10 మ్యాచ్ లు ఆడింది. 5 గెలిచింది. 5 ఓడింది.
పాయింట్స్ పట్టికలో ఆరవ స్థానంలో ఉంది.
–వి. మధుసూదనరావు.





