
క్లిష్ట పరిస్థితుల్లో కీలక పోటీలో గెలవాలంటే ఆటగాడు సమరోత్సాహంతో విజృంభించి తనది కానీ రంగంలో రాణించి జట్టును గెలిపించాడంటే అది నిజమైన నిబద్ధత. అవసరం ఆర్ ఆర్ విషయంలో అదే జరిగింది.ముంబై ఇండియన్స్ తో ప్లే ఆఫ్ స్థానానికి జరిగిన పోటీలో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ముంబై ను ఓడించి ప్లే ఆఫ్ బెర్త్ ను దక్కించుకుంది.ఇది నాల్గో ,మరియు చివరి ప్లే ఆఫ్ స్థానం అన్న మాట.ఆర్చర్ బ్యాటింగ్ లో కూడా రాణించాడు. 15 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు స్కోరు పెంచడానికి ఉపయోగపడ్డాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ చేటప్పుడు అద్భుతంగా తెలివిగా బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జోహరా ఆర్చర్ ఆల్ రౌండ్ ప్రతిభని కనబరిచాడు. టాస్ ఓడినా మొదట బ్యాటింగ్ కి దిగిన రాయల్స్ నిలదొక్కుకొని 20 ఓవర్ లలో 8 వికెట్లు కోల్పోయి,205 పరుగులు చేశారు ..జైస్వాల్ 21 పరుగులు చేయగా అందరూ పెద్ద ఆశలు పెట్టుకున్న సూర్య వంశీ చాలా నిరాశ పరిచి, కేవలం 4 పరుగులకే చాహార్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. జురెల్ కొంత సేపు నిలబడినా బోష్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. స్పెషల్గా వచ్చిన రవీంద్ర జడేజా మాత్రం 19 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్ రోహిత్ శర్మ,,రికెల్ టన్ లు ప్రారంభించి అందరినీ నిరాశ పరిచారు.శర్మ పరుగులేమీ చేయకుండానే ఆర్చర్ కి చిక్కాడు. రీకాల్ టన్ కూడా 12 పరుగులకు బర్గర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.రాజస్తాన్ తమ స్కోరును కాపాడు కుంటూ బౌలింగ్ చేయాల్సి వచ్చింది.సూర్య కుమార్ యాదవ్ ఒక్కడు మాత్రం ఫామ్ లోకి వచ్చి 60 పరుగులు చేసి దాడి చేయ గలిగాడు.తిలక్ వర్మ కేవలం 3 పరుగులకు వెనుదిరిగి నిరాశపరచాడు. ఆర్చర్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీశాడు.బ్రిజేష్ శర్మ 2 వికెట్లు, పంజా 2 వికెట్లు పడగొట్టి 30 పరుగు లు వుండగానే 20 ఓవర్లు పూర్తి చేసి ముంబై ఆశలు గల్లంతు చేశారు.మొత్తం మీద ఆర్చర్ ప్రతిభ రాయల్స్ గెలుపునకు తోడ్పడింది.
కోల్కతాపై డిల్లీ క్యాపిటల్ గెలుపు
కోల్కతా నైట్ రైడర్స్ కి ఇది పీడ కల. తమ సొంత మైదానం కోల్కతాలో ప్రత్యర్థి డిల్లీ క్యాపిటల్ ను మట్టి కరిపించాలన్న కోరికతో ఆటలో దిగిన కె కె ఆర్ జట్టుకు శృంగ భంగం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. కె ఎల్ రాహుల్ 60 పరుగులు, కెప్టన్ అక్షర్ పటేల్ 39 పరుగులు చేసి జట్టుకు బలం చేకూర్చారు. తరువాత ఛేజింగ్ మొదలు పెట్టిన కోల్కతా ఏ దశ లోనూ పోటీ ఇవ్వ లేదు.అపార మైన అనుభవం ఉన్న కెప్టెన్ అజింక్య రహానే మాత్రం నిలబడి 63 పరుగులు చేసి ఎంతో తాపత్రయ పడ్డాడు.రాహుల్ ,రాజన్ బ్యాటింగ్ 40 వేల మంది ప్రేక్షకులు కను విందుగా చూసారు.ఫలితం ఏదైనా అది జట్టుకు వర్తిస్తుంది.వినోదం ప్రేక్షకులకి కావాలి. రాహుల్ .ప్రేక్షకులకు న్యాయం చేశారు.
ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు మొదటి నుంచి చీకు చింతాలేవు. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం అద్భుతంగా బౌల్ చేసి పరుగుల వీరుడు రహానే ను ,కామెరూన్ గ్రీన్ ను ఔట్ చేసి డిల్లీ విజయం లో కీలక పాత్ర పోషించాడు. ఎంగిడి కూడా 3 వికెట్లు , .మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టి కోల్కతా లక్ష్యాన్ని అందుకో కుండా ఆల్ ఔట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. –NRS.
ప్లే ఆఫ్స్ షెడ్యూల్
మే…26.మంగళవారం. క్వాలిఫైయర్…1.. ధర్మశాల రాయల్ చాలెంజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
మే..27…బుధ వారం..ఎలిమినేటర్. న్యూ చండీ గఢ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
మే…29…క్వాలిఫైయర్ ..2. న్యూ చండీ గఢ్
మే ….31….ఫైనల్…అహ్మదాబాద్.





