ఫైనల్ లో బెర్త్ కోసం పోరు

**గుజరాత్ టైటాన్స్ X రాజస్థాన్ రాయల్స్ **


రోజు శుక్రవారం ఐ పి ఎల్ లో జరుగనున్న మ్యాచ్ ఫైనల్స్ కన్నా ఆసక్తి కలిగించేదిగా ఉంది.ఇటు రాజస్తాన్ రాయల్స్ అటు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ ఫైనల్ లో స్థానం పొందడానికి తలపడుతున్నాయి.ఇవ్వాల్టి పోటీలో కళ్ళన్నీ 15 ఏళ్ల సూర్యవంశీ పైనే ఉన్నాయి. చిచ్చరపిడుగు సూర్యవంశీ ప్రత్యర్థులను తన వైవిధ్యమైన,బెరుకు లేని బ్యాటింగ్ తో ముందే భయపెడుతున్నారు.ఇప్పుడు టైటాన్స్ దృష్టి అంతా ఈ తూఫానీ బ్యాట్స్మన్ ను కట్టడి చేయడంపైనే ఉంది. ఈ రెండు జట్లు ఐపీఎల్ లో అత్యంత బలమైన జట్లుగా ఇంతవరకు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ హిట్టింగ్ మీదా జోహ్రా ఆర్చర్ బౌలింగ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
వైభవ్ గురి చి గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్హివ్ మాట్లాడుతూ అతని కళ్ళు చెదిరే బ్యాటింగ్ చూస్తూ ఉంటే ముచ్చట వేస్తోంది.అయినా అతన్ని తొందరగా ఔట్ చేయ గలమనే ఆశగా ఉందన్నాడుగుజరాత్ ప్రధానంగా శుభమన్ గిల్,సాయి సుదర్శన్ ల ఆటపై ఎక్కువ ఆధార పడి ఉంది.జోస్ బట్లర్ కూడా బాగా సహాయ కారిగా ఉంటాడు. ఏమైనా ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.ఈ వాతావరణం రెండు జట్ల లోనూ టెన్షన్ రేపుతోంది.
కూల్ సూర్య వంశీ : మూడు పరుగులలో సెంచరీ మిస్ అయినందుకు ఏ బాధ పద కుండా శాంతం గా వున్న సూర్య వంశీ నీ చూసి నారు ఆశ్చర్య పోతున్నారు. నిజానికి అది ఐ పి ఎల్ లో అతని ఫాస్టెస్ట్ సెంచరీ అయిఉండేది .
ప్రధాన ఆటగాళ్లు :గుజరాత్ టైటాన్స్ :కీలక బ్యాటర్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మరియు డేవిడ్ మిల్లర్.
ఆల్‌రౌండర్లు: రాహుల్ తెవాటియా, అజ్మతుల్లా ఒమర్జాయ్.
బౌలర్లు: రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, మరియు కార్తీక్ త్యాగి.

రాజస్థాన్ రాయల్స్: :
కీలక బ్యాటర్లు: సూర్య వంశీ ,,యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (కెప్టెన్ / వికెట్ కీపర్), మరియు షిమ్రాన్ హతేమయర్.
ఆల్‌రౌండర్లు: రియాన్ పరాగ్.
బౌలర్లు: యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, మరియు సందీప్ శర్మ.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆడిన పోటీలు గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ను 58 పరుగుల తేడాతో ఓడించిందిi
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సుదర్శన్ ఎంపిక అయ్యాడు.
టాప్ బ్యాట్స్మెన్.సాయి సుదర్శన్ 82 (53 బంతుల్లో) .సిమ్రాన్ హతేమయర్ 52 పరుగులు(32 బంతుల్లో)
గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన 9 వ మ్యాచ్ లో రాజస్తాన్ గెలిచింది. ఈ విజయం రాజస్థాన్ విశ్వాసం తో ముందుకు సాగడానికి సహాయ పడింది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలో – గత సీజన్‌లో అలా జరగలేదు.
గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే, రాజస్తాన్ రాయల్స్ గుజరాత్ ను 6 పరుగుల తేడాతో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో ఓడించింది..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రవి బిష్ణోయి ఎంపిక అయ్యాడు..
గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ హెడ్-టు-హెడ్ రికార్డ్ విషయానికి వస్తే, ఈ రెండు జట్లు IPLలో ఆరుసార్లు తలపడగా, రాయల్స్ ఒకసారి గెలిచింది. గుజరాత్ టైటాన్స్ ఐదుసార్లు విజయం సాధించింది .రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. గాయపడిన రియాన్ పరాగ్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్ రాజస్థాన్ కినాయకత్వం వహించాడు. –NRS.
.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *