ఐ పి ఎల్ ఫైనల్స్ లో టైటాన్స్

   ** కెప్టెన్ గిల్ విజయోచిత ఇన్నింగ్స్**
    \ట్టకేలకు పోటీలన్నీ ముగిసి 2026 సీజన్ ఐ పి ఎల్  ఫైనల్స్ కు  చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ శుక్రవారం క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ ను  ఏడు  వికెట్ల తేడాతో ఓడించింది.ఇంకా ఎనిమిది  బాల్స్ మిగిలి  వుండగానే విజయ కేతనం ఎగుర వేసి,ఫైనల్లోకి ప్రవేశించింది.  ఆదివారం  బలీయమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఎదుర్కొంటుంది.   ముందుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ ఆటని పరిగణన లోకి తీసుకోవాలి.అనుకున్నట్టుగానే రాజస్థాన్ జట్టు గట్టి పోటీ ఇచ్చి కష్టమైన ఛేజింగ్ టార్గెట్గా 214 పరుగులు ఉంచింది. కేవలం 6 వికెట్లు పోగొట్టుకుంది. నిజానికి టైటాన్స్ కి అది పెద్ద టార్గెట్.అయినా టైటాన్స్ జట్టు అలవోకగా ఆడి లక్ష్యాన్ని చేరుకుని ఫైనల్స్ కి చేరుకుంది. అందరూ ముద్దుగా ప్రిన్స్ అని పీల్చుకునే శుభమ్ గిల్ ఎటువంటి ఆందోళన లేకుండా వత్తిడి లేకుండా క్రమశిక్షణ గల ఆటతో కళ్ళు చెదిరే షాట్లు కొట్టి జట్టుకు విజయం అందించాడు.కేవలం 53 బంతుల్లో 104 పరుగులు చేశాడు.అందులో 15 ఫోర్లు,3 సిక్సులు ఉన్నాయి.గిల్ కి మరో ఓపెనర్ అయిన సాయి సుదర్శన్ కూడా అద్భుతమైన సహకారం అందించి ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అటు సాయి సుదర్శన్ 32 బంతులలో 58 పరుగులు చేశాడు.8 బౌండరీలు,ఒక సిక్సర్ సాధించాడు.గిల్ ఆర్చర్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ ఔట్ అయ్యాడు. వెటరన్ జడేజా ఏం వికెట్లు తీయలేక పోయాడు. అంతకు ముందు తొలి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవంగా ప్రారంభించింది.స్కోర్2 పరుగులు ఉండగా సిరాజ్ బౌలింగ్ లో జైస్వాల్ క్యాచ్ ఔట్ అయ్యాడు.వైభవ్ సూర్య వంశీ తన సహజ శైలిలో ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించాడు.ఎటువంటి బెరుకు వత్తిడి లేకుండా షాట్ ల మోత మోగించాడు. రబడ బౌలింగ్ లో వ్యక్తి గత స్కోర్ 96 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తరువాత వచ్చిన జురెల్ పెద్దగా నిలబడ లేదు. రవీంద్ర జడేజా రావడం జట్టుకు కాస్త మేలు జరిగింది.45 పరుగులతో జడేజా అజేయంగా నిలిచాడు.పరాగ 12, శనాక 3,ఆర్చర్7 పరుగులు చేయగా, పెరీరా మాత్రం కొంత పోటీ ఇచ్చి దాడి చేశాడు. 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సూరజ్..1,రబడ2.,కృష్ణ 1, హోల్డర్ 2 వికెట్లు తీశారు..రషీద్ కూడా బంతి తో విఫలం అయ్యాడు.
సాయి సుదర్శన్ గిల్ రికార్డు : ఈ మ్యాచ్ లో టైటాన్స్ ఓపెనర్లు శుభమన్ గిల్,సాయి సుదర్శన్ మొదటి వికెట్ కి 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఐ పి ఎల్ ప్లే ఆఫ్స్ దశలో తొలివికెట్ భాగస్వామ్యంలో ఇదే రికార్డు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్య వంశీ ఈ సీజన్ లో మొత్తం 776 పరుగులు చేశాడు.సగటు 48.50.
ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది రాజస్థాన్ బ్యాటర్ లలో రెండో అత్యధిక స్కోర్.
జోస్ బట్లర్ 2022 సీజన్ లో 863 పరుగులతో మొదటి స్థానంలో వున్నారు.  --NRS. 


Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *