మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్ ఆర్ సి బి

** కోహ్లీ బ్యాటింగ్ — అద్భుతమైన బౌలింగ్ **

         కోహ్లీ బ్యాటింగ్ కు తోడు అద్భుతమైన బౌలింగ్  ఆర్ సి బి రిపీట్ గెలుపునకు తోడ్పడింది.   నిలకడగా,ధాటిగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడం అసలు సిసలైన ఛాంపియన్స్ లక్షణం.ఏదో గాలి వాటంగా  బంతులను బాదేయడం, అదృష్టం కొద్ది వికెట్లు తీయడం వారి ఆట కాదు.అయినా జాగ్రత్తగా పథకం ప్రకారం అదీ లక్ష్యం నుంచి దృష్టి మరల్చకుండా ఆడడం వారి ప్రత్యేకత.

ఐ పి ఎల్ 2026లో ఈ సారి మొదటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎక్కడా తడబడకుండా గర్వం తలకి ఎక్క కుండా చూసుకు టూ వచ్చిన అవకాశాలని రెండు చేతులా అంది పుచ్చుకుని దూసుకు పోయి ఛాంపియన్ షిప్ ను ఎగరేసుకు పోయింది. పోయిన ఏడాదీ అలాగే ఆడి గెలుచుకుంది.కోహ్లీ ఛాంపియన్షిప్ లో ఆద్యంతం ధాటిగా ఆడగా బౌలర్ల పై గట్టి నమ్మకం పెట్టుకోవచ్చు అనే భరోసా బౌలర్లు ఇచ్చారు. ఫలితంగా ఆర్ సి బి విజయం సాధించింది.ఇదేమంత సునాయాస విజయం కాదు.అయిన ఒడిదుడు కులు ఉంటాయని వాటిని సమయస్ఫూర్తితో దాటి నిలిచి గెలవాలని అని బెంగళూరు నిర్ణయించుకుంది.చేసి చూపించింది.
తమ జట్టు అందరి సామర్థ్యం పై ఎంతో నమ్మకం ఉంటేగానీ ఒక జట్టు టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ తొలుత ఇవ్వడం జరగదు.బెంగళూరుకు ఆత్మ విశ్వాసం ఎక్కువ.పైగా కోహ్లీ లాంటి దిగ్గజం ఉంటే దిగులే ఉండదు.

       ఆదివారం  తొలుత ఆహ్లాదకరమైన వాతావరణంలో టాస్ జరిగింది.  బెంగళూరు జట్టు  టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ ను బ్యాటింగ్ కి దింపింది..కానీ ఆట మొదటిలోనే వికెట్లు కోల్పోయి దెబ్బతిన్న టైటాన్స్ ఇంకా కోలుకోలేక పోయారు. బెంగళూరు  బౌలర్లని  ఎంత పొగిడినా తక్కువే.  క్రమశిక్షణతో బాణాల వంటి బాల్స్ వేసే భువనేశ్వర్ కుమార్ ఎప్పుడూ నిరాశపరచడు.గుజరాత్ జట్టును 20 ఓవర్లలో   8 వికెట్లు పడగొట్టి కేవలం 155 పరుగులకు కట్టడి చేశారు. పవర్  ప్లే సమయం లో జోష్ హాజెల్వుడ్ 37 పరుగులు  ఇచ్చి రెండు  వికెట్లు తీశాడు.  భువనేశ్వర్ 29 పరుగులు ఇచ్చి,2 వికెట్లు తీశాడు..సుదర్శన్ (12), శుభమన్  గిల్ (12)   తొందరగా ఔట్ అవడంతో గుజరాత్ టైటాన్స్ పతనం మొదలై  అదే రీతిలో కోనసాగింది. రసికి సలాం  షాట్ లకు అవకాశం ఇవ్వకుండా బౌల్ చేసి  27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం తో చాప చుట్టేయడం లాంఛనమే అయిపోయింది.పేసర్లకి మద్దతుగా పాండ్యా  మెరుగ్గా బంతులు వేసి 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.గుజరాత్ 150 పరిధి దాటింది  అంటే అది వాషింగ్టన్ సుందర్ పోరాడటమే కారణం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సుందర్ 37 బంతుల్లో 50 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం..చివరి 10 ఓవర్లలో 92 పరుగులు చేసి టైటాన్స్ పరువు నిలబెట్టుకుంది. . సుందర్ ,జోష్ సాధించిన 29 పరుగులు  అతి పెద్ద బాగా స్వామ్యం.దీనిని బట్టి ఆర్ సి బి  బౌలర్లు ఎంత పటిష్టంగా బౌలింగ్  చేశారో తెలుస్తుంది.

    టార్గెట్  156 పరుగుల విజయ లక్ష్యంతో  బరిలోకి దిగిన ఆర్ సి బి బ్యాటింగ్ ను  విరాట్  కోహ్లీ,అయ్యర్లు పారంభించారు.ఇద్దరికీ ఇద్దరే.జాగ్రత్తగానే ఆడుతూ అవకాశాలని వదులుకోకుండా షాట్ లతో విరుచుకు పడ్డారు.అయ్యర్ ,కోహ్లీ కలిసి 27 బంతుల్లో 62 పరుగులు తొందరగా సాధించి గట్టి పునాది వేశారు. తొమ్మిదవ ఓవర్ లో రషీద్ ఖాన్  పటిదార్  (15), కునాల్ (1) రూపం లో రెండు వికెట్లు తీసి కొంత కలవరం కలిగించినా అది ఎంతో సేపు నిలవ లేదు..విజయం సాధించడం లో అనుమానం లేక పోయింది.  కారణం ఇంకా బ్యాటింగ్ లో కోహ్లీ ఉండడమే.  డేవిడ్ 24 పరుగులు  చేసి సహాయ పడ్డాడు ఇంకా చివర్లో వికెట్ కీపర్ శర్మ 11 పేరు గులతో  నాటవుట్ గా  ఉన్నాడు. 18 వ ఓవర్ లోనే  బెంగళూరు జట్టు లక్ష్యాన్ని ఛేదించారు.  --నిడమర్తి రాజశేఖర్ 
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *