పల్లె ప్రగతికి పరితపించిన ‘పెద్ది’

    సంక్రాంతి తరువాత సినిమా ప్రేక్షకులు గత కొన్ని నెలలుగా భారీ చిత్రాల విడుదలకై నిరీక్షిస్తున్నారు.   రాంచరణ్ తాజా చిత్రం పెద్ది ప్రేక్షకుల తీర్పు కోరుతూ గురువారం విడుదలైంది.  ఉప్పెన వంటి సరికొత్త సంచలన ప్రేమ కథ అందించిన దర్శకుడు సానా బుచ్చిబాబు గారి దర్శకత్వ సారొచ్చిండు క్రీడా నేపథ్యం పల్లె ప్రగతి క్రీడాకారుని పట్టుదల ఆశయం వంటి అంశాలని కథ తెరమీద భావోద్వేగ బరితంగా 189 నిమిషాలు అందించారు    పెద్ది చిత్రం భారతీయ క్రీడాకారులలో తగ్గుతున్న ప్రతిభ , పతకాలు  సాధించలేని పరిస్థితి గురించి ప్రారంభం అవుతుంది క్రీడలకు చెందిన ఉన్నతాధికారి విజయనగరం వస్తారు అక్కడ స్థానిక క్రీడాకారులు అందరూ  పెద్ది క్రీడా స్ఫూర్తిని గురించి  చెప్తారు   కథ, కథనాలు ఒక్కసారి గతానికి పెడతాయి విజయనగరానికి దూరంగా ఉన్న కొండమీద గ్రామానికి చెందిన క్రీడాకారుడు  పెద్దిది. వారికి కనీస సౌకర్యాలు ఉండవు. పౌరులుగా గుర్తింపు ఉండదు. సినిమా అంతా విజయనగరం బొబ్బిలిమధ్య క్రీడల పోటీ  జరుగుతూ ఉంటుంది చిత్ర ప్రారంభంలో పెద్ది  క్రికెట్ క్రీడాకారుడిగా మంచి ప్రతిభని ప్రదర్శిస్తాడు.  మధ్యలో నాటకీయత గురించి కొన్ని సన్నివేశాలు సృష్టించారు   అప్పల సూరిగా జగపతి బాబు పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దారు. నిశితంగా గమనిస్తే తప్ప గుర్తుపట్టలేము.విశ్రాంతికి ముందు సన్నివేశాలు కథను మలుపు తిప్పుతాయి.  గ్రామ సౌకర్యాల గురించి కథానాయకుడు కుస్తీ , పరుగు పందాలు ఎంచుకుంటాడు.  చిత్రం ముగింపు వెండితెరపై చూడవలసిందే.  పెద్ది క్రీడా చిత్రమైన ఇతర క్రీడా చిత్రాలకు భిన్నంగా ఉంది చిత్రం అంతా దర్శకుడు రాంచరణ్ పాత్ర మీద దృష్టి కేంద్రీకరించారు.  కేవలం ఒక పాయింట్ ఆధారంగా కథా కథనాలు నడిచాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర పరిమితంగా ఉంది. ప్రేక్షకులకు రిలీఫ్ కోసం  కథానాయకుడు, కథానాయిక  మధ్య ప్రణయ సన్నివేశాలు, యుగళగీతాలు చిత్రీకరిస్తే మరింత రక్తికట్టేది. అమలాపురానికి చెందిన  సాయి శ్రీనివాస్ అతిథి  పాత్రలో కనపడ్డారు. ప్రముఖ  టెలివిజన్ నటుడు శ్రీనివాస్ రెడ్డి.చిత్రం ముగింపు దృశ్యాలలో  కనిపించారు.  చాలా రోజుల ఏ.ఆర్. రహమాన్  ఈ చిత్రానికి సంగీతం  అందించడం విశేషం.  'చికిరి.. చికిరి' పాట ప్రేక్షకులను అలరిస్తుంది.  ఈ పాటకు రాంచరణ్ వేసిన స్టెప్స్ బాగున్నాయి. 
--డాక్టర్ దువ్వూరి శర్మ , 
సినీ పరిశోధకులు , 99490 39175  
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *