కొత్త ప్రయోగం సంగీతం

    సృజన కలిగిన తెలుగు సినిమా దర్శకులలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. సింగీతం ప్రస్తావన రాగానే  'మయూరి',  'విచిత్ర సహోదరులు',  'ఆదిత్య 369' , 'భైరవద్వీపం' వంటి మంచి చిత్రాలు గుర్తుకు వస్తాయి.  దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మాటలు లేకుండా 'పుష్పక విమానం' రూపొందించారు.  అది విజయవంతం అయింది. ఇప్పుడు  తన 94వ ఏట కేవలం పాటల ద్వారా సంగీతం అనే చిత్రం రూపొందించారు చిత్రాన్ని ఎలాంటి లాజిక్ లేకుండా వీక్షించినప్పుడు నచ్చుతుంది .  సినిమా అంతా ఊహ అనేది ప్రధానంగా ఉంటుంది. తర్కం  గురించి ప్రేక్షకుడు  ఆలోచించినప్పుడు నచ్చదు.  సినిమా అభిరుచిగల  నిర్మాతలు సప్న ఈ చిత్రాన్ని నిర్మించారు.  'మహానటి' చిత్రాన్ని అందించిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు.  సినిమాలో చాలా మంది  కొత్తవారు నటీనటులుగా పరిచయమయ్యారు.  సీనియర్ నటి తులసి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. చిత్రం అంతా పాటలతో నడుస్తుంది.  శ్రీమణి వంటి ప్రతిభగల రచయిత మంచి భావాలను  అందించారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రశంసలు పొందే స్థాయిలో ఉంది.  కుబేర పురం గ్రామంలో బంగారు గనుల అన్వేషణ చిత్రంలో కీలక అంశంగా ఉంటుంది.  అద్భుత భావోద్వేగాలు తెరమీద ప్రతిబింబించాయి.  చిత్రం అంతా ప్రతాప్, రేణు, గౌరి పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రథమార్థంలో కథ నెమ్మదిగా నడిచినప్పటికీ  ముగింపు ఆర్ద్రతతో నిండి ఉంటుంది. ఆ దృశ్యాల చిత్రీకరణలో  దర్శకుని. అనుభవం కనిపిస్తుంది. చిత్రంలో ప్రకృతిని పరిరక్షించడం, పర్యావరణ పరిరక్షణ అంశాలు దాగివున్నాయి. సింగీతం  సృజనకి గౌరవంగా అందరూ ఈ చిత్రాన్ని చూడడం విశేషం.  ఎలాంటి అంచనాలు లేకుండా ఈ  సినిమా చూస్తే నిరాశ  కలిగించదు.  నగరాలలో, మెట్రో సిటీలలో నివసించే ప్రేక్షకులకు, అభిరుచిగల ప్రేక్షకులకు కొత్తదనంతో  కూడిన  ఈ సినిమా నచ్చుతుంది.  మాస చిత్రాలు ఇష్టపడే సగటు ప్రేక్షకులకు భిన్నంగా అనిపిస్తుంది.  

డాక్టర్ దువ్వూరి శర్మ , సినీ పరిశోధకులు, 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *