ఆత్మీయ భావోద్వేగాల ‘మా ఇంటి బంగారం’


తెలుగు సినిమా పరిశ్రమలో మహిళా దర్శకులు పరిమితంగా ఉన్నారు. భానుమతి విజయనిర్మల తర్వాత ప్రస్తుత తరం వారిలో నందిని రెడ్డి ‘ఓ బేబీ’ వంటి నవ్యత గల చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందారు. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ కుటుంబ పరమైన అంశాలు కథ, కథనాలుగా తెరమీద ప్రేక్షకులకి నచ్చే రీతిలో నందిని రెడ్డి మలిచారు సమంత రంగస్థలం, మనం, దూకుడు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు చాలాకాలం తర్వాత చిత్రంలో బలమైన భావోద్వేగాలు గల పాత్రలో సమంత కనిపిస్తారు. చిత్రంలో ఝాన్సీగా, స్వర్ణగా రెండు భిన్నకోణాలలో అందరి అభినందనలు అందుకునే స్థాయిలో నటించారు సమంత ప్రేమ, భయం, కోపం వంటి భావోద్వేగాలని తెరమీద బాగా పండించారు సమంత పాత్రకి గతంలో ఒక నేపథ్యం దాగి ఉంటుంది. అది వర్తమాన కాలంలో ఎలా ప్రభావం చూపించింది. సమంత పాత్ర ఎలాంటి సంఘర్షణలు లోనవుతుంది. అంతేకాదు పరిస్థితులని ఎదుర్కొని చివరికి ఏ విధంగా జయించారు అన్నది తెరమీద చూస్తే ఆసక్తిగా ఉంటుంది చిత్రంలో ప్రేక్షకులకి బాగా పరిచయమైన తారలు గౌతమి, శ్రీ లక్ష్మీ , టెలివిజన్ యాంకర్ శ్రీముఖి కీలక పాత్రల్లో మెరిశారు. ఆనంద్ సినిమా చివరి వరకు ముఖ్య పాత్రలో కనపడ్డారు సమంత మొత్తం తానే అయి సినిమా చివరి వరకు నడిపించారు సినిమాలో ఒక గ్రూప్ సాంగ్ , నేపధ్య గీతం వస్తాయి. ప్రేక్షకులకు విసుగు రాకుండా సినిమా స్క్రీన్ ప్లే నడిపించారు. మరికొన్ని పాటలు చేరిస్తే సినిమాకి అదనంగా బలం చేకూరేది. ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు రావడం విశేషం. సమంతపట్ల ప్రేక్షకులకు ఉన్న అభిమానం ప్రధాన కారణంగా నిలిచింది .
— డాక్టర్ దువ్వూరి శర్మ , సినీ పరిశోధకులు, 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *