ఆధ్యాత్మిక భావోద్వేగాల ‘నాగబంధం’

  తెలుగు సినిమా జోనర్ పరిధి పెరిగింది.  ప్రేమ కథల నుంచి ఫాంటసీ కథలు, థ్రిల్లర్ కథలు ఇలా విభిన్న అంశాల వైపు తెలుగు సినిమా ప్రయాణిస్తోంది.  శుక్రవారం విడుదలైన నాగబంధం చిత్రం ప్రారంభం నుంచి ప్రేక్షకులను  ఆకర్షించింది.  వందకోట్ల రూపాయల  బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా జత కలిశాయి. నామా అభిషేక్ దర్శకత్వంలో వచ్చిన నాగబంధం చిత్రం గతం, వర్తమానం మధ్య నడుస్తుంది. ఇటీవల కాలంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఆలయానికి సంబంధించిన విశేషాల కథనాలు వార్తలలో ప్రముఖంగా నిలిచాయి. ఇక్కడ శ్రీరంగనాథ స్వామిగా చిత్రంలో చూపించారు చిత్రంలో కథంతా బ్రహ్మ కమలం, నాగబంధం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. 1960 - 70వ దశాబ్దం మధ్య జరిగిన ఘటనలు కీలకంగా తెరమీద చూపారు. చిత్రం తెరమీద చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ప్రధమ భాగం అంతా చాలా రిచ్ గా చిత్రీకరించారు. గ్రాఫిక్స్ , కెమెరాతో చిత్రీకరణ , విజువల్స్ ఇవన్నీ ఆసక్తి కలిగించాయి. ద్వితీయ భాగం కథ మరలా గతానికి వెళ్తుంది. ఇక 'పెదకాపు' చిత్రం ద్వారా పరిచయమైన విరాట్ కర్ణ రెండు విభిన్న పాత్రల్లో మెరిశారు. నభా నటేష్ ప్రధాన పాత్రలో కనపడ్డారు. వర్ధమాన తారలు అందరికీ పరిచయమైన వారే. అనసూయ జగపతిబాబు ప్రధాన పాత్రలలో కనపడ్డారు మురళీ శర్మ పురోహితుడుగా పురోహితుడు పాత్రలో నటించారు ఒక విధంగా చూస్తే చిత్రం నిడివి ఎక్కువగానే ఉంది. చిత్రంలో ప్రేమ భయం కోపం భావోద్వేగాలు ప్రతిబింబించాయి పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి సినిమాకు సంబంధించి ఇంకా బలమైన భావోద్వేగాలతో పాటు ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ కనబరిస్తే బాగుండేది. సినిమా ప్రేమికులు ఒకసారి నాగబంధం చిత్రం చూడవచ్చు ఇది ఆధ్యాత్మిక భావోద్వేగాల చిత్రంగా పేర్కొనవచ్చు.
-- డాక్టర్ డి.వి.ఎస్. ఎస్. శర్మ , సినిమా పరిశోధకులు , 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *