యాత్రికుల సేవలో రెండు దశాబ్దాలు

 పాస్పోర్ట్ సేవలు, యాత్రల నిర్వహణ ద్వారా పర్యాటక రంగంలో రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న 
చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ సంస్థ కొత్త ఆఫీసులో అడుగుపెడుతోంది. యాత్రికుల ఆదరాభిమానాలు
అందుకున్న 'సత్యం' -- సంగిశెట్టి సత్యనారాయణ తన విదేశీ పర్యటనల అనుభవంతో యాత్రికులకు
సేవలందిస్తున్నారు. ప్యాకేజీ టూర్స్ ద్వారా యాత్రా బృందాలను దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు
యాత్రా బృందాలను తీసుకెళ్లడంతో పాటు పాస్పోర్ట్, వీసా సేవలను, విమాన ప్రయాణ టికెట్ల కొనుగోలు సేవలను   అందిస్తున్నారు.  కొత్త ఆఫీసు ఇసిఐఎల్ ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న భవానీ ప్లాజాలోని 404 నెంబరు ఫ్లాట్ లో ఉంటుంది. యాత్రలు జరిపే వినియోగదారులపట్ల తమకుగల అభిమానాన్ని చాటుకునేందుకు
కొత్త ఆఫీసు ప్రారంభం సందర్బంగా మూడు రోజుల పాటు సత్యనారాయణ ఫీసుల్లో కొన్ని రాయితీలు,
టూర్ చార్జీల విషయంలో కొన్ని ఆఫర్లు ప్రకటించారు.
వీటిలో మొదటిది పాస్పోర్ట్ సర్వీసు. పాస్పోర్ట్ రెన్యూవల్ / కొత్త పాస్పోర్ట్ తీసుకునే వారికి
నామమాత్రపు సర్వీసు చార్జీ 100 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా తమద్వారా ఏదైనా
ప్యాకేజీ టూర్ బుక్ చేసుకుంటే రూ. 3000 రాయితీ ఇస్తామని తెలిపారు.
ఏడాది పొడవునా ప్రతి నెలలో వివిధ ప్రాంతాలకు టూర్స్ నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.
వినియోగదారులు తమ కొత్త ఆఫీసును సందర్శించాలని ఆఫర్లను పొందాలని ఆయన ఆహ్వానించారు.
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *