
ప్రతీ శుక్రవారం తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాలు తీర్పు కోరుతూ వస్తాయి. ఈ వారం విడుదల అయిన ‘లెనిన్’ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రచారం వలన ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. అక్కినేని నటవారసుడిగా ‘అఖిల్’ ఇప్పటి వరకు ప్రేమ కథాచిత్రాలలో నటించారు. లెనిన్ చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులకి మరింత చేరువ కావడానికి దర్శక, నిర్మాతలు బలమైన ప్రయత్నం చేసారని లెనిన్ సినిమా చూసాక ప్రేక్షకులకి అర్ధం అయ్యింది. లెనిన్ చిత్రం వర్తమానం నుంచి గతానికి వెడుతుంది. లెనిన్ పాత్రలో అఖిల్ మాస్ తరహాలో పూర్తిస్ధాయి అభినయం కనబడింది. ఒక విధంగా మహాభారతకథ అని దర్శక, నిర్మాతలు చెప్పినా… ఇది గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించింది. చిత్రానికి స్కీన్ ప్లే అండగా నిలిచింది. దర్శకులు మురళీ కిశోర్ అబ్బూరి చిత్రంలో అన్ని అంశాలని తన కథలో జతచేసారు. స్నేహం, ప్రేమ, పగ, ప్రతీకారం, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా అన్ని అంశాలని కథనం నిండా నడిపించారు. చిత్రంలో గ్రామీణ వాతావరణ సంస్కృతిని ప్రథమ భాగంలో పరిచయం చేసారు. విశ్రాంతికి ముందు సన్నివేశాలు కథ, కథనాలని మలుపు తిప్పాయి. యిక విశ్రాంతి తరువాత ప్రేక్షకులు ఊహించని మలుపులు కధలో తెరమీద కనబడతాయి. అయితే అధికంగా సినిమాలు చూసే ప్రేక్షకులు ఇవి ఊహిస్తారు. చిత్ర ముగింపు భావోద్వేగ భరితంగా ఉంటుంది. అది తెర మీద చూస్తే బాగుంటుంది.
సినిమా పరిశ్రమలో విజయం కోసం పరితపిస్తున్న అఖిల్ నటనలో, డైలాగ్ డెలివరీలో పరిణతి కనబడింది. మాస్ పాత్రలో అఖిల్ అందరి అభినందనలు అందుకొనే స్ధాయిలో నటించారు. భారతిగా భాగ్యశ్రీ యువ ప్రేక్షకులని అలరిస్తారు. అఖిల్, భాగ్యశ్రీ ల కెమిస్ట్రీ తెరమీద బాగా పండింది. శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ఈశ్వరరావు పాత్రలు కీలకంగా కథని నడిపించాయి. ప్రతినాయకుడిగా ప్రమోద్ పాత్ర కొత్తగా ఉంది. ప్రతినాయక ఛాయలు కలిగిన బంధువుగా వడ్లమాని సాయి శ్రీనివాస్ చివరి వరకు నటించారు. తమన్ సంగీతం ప్రశంసనీయంగా ఉంది.
చిత్ర విజయం కోసం నాగార్జున , నిర్మాత నాగవంశీ చేసిన ప్రయత్నం ఫలించింది. మొత్తం మీద విజయవంతమైన చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ దారిలో ఉంది. అఖిల్ కి కొత్త ఊపిరిని ‘లెనిన్’ అందిస్తుంది.
—డా. డి.సుబ్రహ్మణ్య శర్మ, అధ్యాపకులు, పరిశోధకులు, 9949039175.


