
ఆగస్టు 9వ తారీఖు తెలుగు వారందరూ 'ప్రిన్స్' గా ఆరాధించే మహేష్ బాబు జన్మదినం. మహేష్ హీరోగా నటించిన శ్రీమంతుడు విడుదలై పదకొండు సంవత్సరాలైనా చిన్నితెరపై ఇప్పటికి ఎవర్ గ్రీన్ గా పలకరించే 'శ్రీమంతుడు' చిత్రం గురించి అక్షరాభినందనాలు అందించాలనే ఆశ. 2015 సంవత్సరం తెలుగు సినీ అభిమానులకి గొప్పజ్ఞాపకంగా అచ్చమైన చందమామ కధ, బహుబలి వంటి భారీ చిత్రం అభ్యుదయ భావాల్ని కథ, కథనాలులో కలిపి సందేశాల సారంగా వచ్చిన శ్రీమంతుడు చిత్రం రెండు స్వల్ప వ్యవధిలో విడుదలై ఘాన విజయం సాధించాయి. రాజప్రసాదాల సంఘర్షణలు, పోరాటాలు ఒక కధలో, ఆదర్శాలు, అపార్ధాలు, ఆత్మీయతలు ఇవన్నీ శ్రీమంతుడుకి కధనాలు. రెండు సమంగా భావోద్వేగాల్ని నిండారా సమర్పించాయి.
దర్శకులు కొరటాలశివ ప్రతీ కధలో అభ్యుదయ భావాల్ని తన కథనాలలో సాన్నిహిత్యంగా చేర్చి ప్రేక్షకులకి నచ్చేలా చిత్రీకరిస్తారు. ఆయన చిత్రాలలో పాత్రలు స్పూర్తిదాయకంగా ఉంటాయి. కీర్తిని సంపాదిస్తాయి. చిత్రాలలో పాత్రలు ఆదర్శవంతంగా ఉంది ప్రజల మనస్సులో పరివర్తన తెస్తాయి. శ్రీమంతుడు చిత్రం గ్రామీణ ప్రగతికి వ్యక్తుల సంకల్పానికి ప్రపంచ వ్యాప్తంగా అంకురించేలా చేసింది. ఇది ఊహల కల్పన సాధించిన యదార్ధ విజయం.
ప్రిన్స్ మహేష్ బాబుని చిలిపితనం హుషారు, ప్రేమ కుర్రకారు విపరీతంగా వ్యక్తిగా ఇంత వరకు దర్శకులు తమ కథలలో జీవం పోశారు. మహేష్ అభినయం సరదా సరదాగా ఉండేది. రచయితలు సంభాషణలు ఆవిధంగానే రాసి పలికించేవారు గానీ మహేష్ బాబులో ఒక సహృదయ వ్యక్తిత్వానికి, ఆదర్శానికి అంతకు మించి ఆచరణని వందశాతం పాటించే హర్షవర్ధన్ పాత్రని పరకాయ ప్రవేశం చేయించారు. చిత్ర విచిత్రంగా కథనాయికి చారుశీల పాత్ర నేపధ్యం గ్రామీణ వాతావరణానిది. గ్రామదత్తత అనేది ప్రచార అంశంగాదని ‘గ్రామదత్తత’ కోసం పరితపించినప్పుడు పల్లె వికసిస్తుంది. అభివృద్ధికి అంకురార్పణ జరుగుతుంది. కథ, కధానాలలో కేవలం అభ్యుదయ భావాలు గాకుండా సున్నితమైన మానవ సంబంధాలు, భావోద్వేగాలు కలిసి నడిచాయి. ఉపాధి, అభివృద్ధి కరువు కోరలో చిక్కినప్పుడు వలసలు కనబడతాయి. అవన్నీ దర్శకులు కథలో ప్రస్తావించారు. హర్ష పాత్ర నిజమైన అభివృద్ధి కోసం శ్రమిస్తుంది. తన ప్రాణాలని ఫణంగా పెడతాడు కథానాయకుడు. చివరి వరకు హర్ష ఆదర్శాన్ని విభేధించిన కుటుంబం సైతం అంగీకరిస్తుంది. చారుశీల అపార్ధాలు తొలిగి హర్షపై ప్రేమని పెంచుకుంటుంది.
శ్రీమంతుడు చిత్రం పాటల అన్నీ ఉద్వేగాలుని ఆవిష్కరించాయి. 'పోరా శ్రీమంతుడా' అన్న పాట నిజంగా కథని మొత్తం అక్షరాలలో అందిస్తుంది. సినిమా నిండా భారీ తారాగణం ఉన్నా అన్ని పాత్రలకి కధాపరంగా న్యాయం జరిగింది. చిత్రంలో ప్రేమ, కోపం, ఆసక్తి, హస్యం భావోద్వేగాలు మెరిసాయి. బాహుబలి వంటి ఊహాజనిత కథని శ్రీమంతుడు వంటి సందేశాల కథని ప్రపంచ వ్యాప్తంగా ఆదరించడం విశేషం. తరువాత మహర్షి ఇలాంటి కథనాన్ని అందించినా శ్రీమంతుడు స్ధాయిలో విజయం అందుకోలేదు. అభ్యుదయాల శ్రీమంతుడు ఎప్పటికి అలరిస్తూనే ఉంటాడు.
డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , పరిశోధకులు ,సెల్ : 9949039175





