నేలపై రంగుల వయ్యారాలు ఇంద్రధనుస్సు వర్ణాలు ముగ్గులతో మెరిసిన చుక్కలు నింగిన నక్షత్రాల్ని తలపించిన గుర్తులు నిత్య నూతనంగా సంక్రాంతి సంబరాలు అతివల కళాభిరుచులు ముగ్గులతో కదిలిన రథాలు మనోభావాలను పరవశింపజేస్తాయి .
ప్రతి ఇంటా ముత్యాల ముగ్గులు శోభిస్తాయి జై జవాన్ .. జై కిసాన్ అంటూ నినదిస్తాయి పల్లె నుంచి శిల్పారామం దాకా గృహ ఆవరణ నుంచి ఆలయం దాకా ముగ్గులు సౌందర్య ఆరాధనలు అవి పూలతో అందంగా సింగారించుకొని
వేణుమాధవుల్ని స్వాగతిస్తాయి.





