తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలలో ఐక్యత సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కృషిచేస్తున్నది. అందులో భాగంగా కార్యకర్తల సమీకరణ, జంటనగరాలలో వివిధ బస్తీలలో , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నేతన్నల సంఘాలను ఏర్పాటు చేస్తున్నది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్బంగా జంటనగరాలలో దాదాపు పది సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక 2026 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరింపజేసుకున్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ సమావేశాలకు అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్, ఉపాధ్యక్షులు వనమాల శంకర్ , పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు మ్యాడం బాబూరావు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలకు హాజరైన నాయకులు ఇటీవల జరిగిన ఎన్నికలలో సర్పంచులుగా గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్మశాలీలలో రాజకీయ చైతన్యం మరింత పెరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

బొల్లిగూడెం సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 క్యాలెండర్ 2026 ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షులు రచ్చ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేందర్, మీడియా ఇంచార్జ్ దాస శ్రీధర్, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మల్లేశం పాల్గొన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని హెచ్ బి కాలనీ (మౌలాలి) శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ 2026 ఆవిష్కరణలో రాష్ట్ర కార్యదర్శి జోగు సూర్యప్రకాష్, ధ్రువ కుమార్, వల్లకాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చింతల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, సంఘం నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ఇరుకుల్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో సైనికపురి పద్మశాలి సంఘం నూతన కార్యాలయంతో పాటు క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వనమాల శంకర్ , కార్యదర్శి జోగు సూర్యప్రకాష్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిగేటి దేవేందర్ , బొల్లి గూడెం సంఘం అధ్యక్షులు రచ్చ శ్రీనివాస్ ,హెచ్ బి కాలనీ కార్యదర్శి శ్రీహరి , కాప్రా సంఘం అధ్యక్షులు ధార్న మల్లయ్య ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రోజు బోడుప్పల్ పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అదే విధంగా మెదక్ జిల్లా చేగుంటలో అధ్యక్షులు మ్యాకల జయరాములు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.





