వెండితెర ప్రతిభా పద్మాలుశ్రీ మురళీ మోహన్, శ్రీ రాజేంద్ర ప్రసాద్

వెండితెరపై 5 దశాబ్దాలుగా అన్ని తరాల వారికి పరిచయం అయిన మనందరికి సుపరిచితులు అయిన కళాకారులు శ్రీ రాజేంద్రప్రసాద్, శ్రీ మురళీ మోహన్ గారికి పద్మ పురస్కారాలు లభించడం తెలుగు వారందరికి ఆనందాన్ని కలిగిస్తోంది. వెండితెరపైనే గాకుండా చిన్నితెర ద్వారా తరం నుంచి తరానికి తమ సినిమాలు ద్వారా నిత్యం పలకరిస్తూ ఉంటారు. సీనియర్ నటులు శ్రీ మురళీ మోహన్ గారు 70వశకంలో సినిమాకి అడుగులు వేసారు. కధానాయకుడి నుంచి కారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని పాత్రలకితనదైన శైలి ద్వారా జీవం పోసారు. అందరి దర్శకులుకి కుటుంబ కధా చిత్రాలుకి ఎంపిక గా నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడిగా మెరిసారు. అక్కినేని గారి చెంత నటించారు. తన అభిరుచికి అనుగుణంగా మంచి నిర్మాణ సంస్థ: జయభేరి ని స్థాపించారు. వారాలబ్బాయి నుంచి అతడు చిత్రం వరకు నందీ పురస్కారాలు అర్హత గల చిత్రాలని నిర్మించారు. ఓ తండ్రి తీర్పు ద్వారా ఉత్తమ కథానాయకుడిగా పురస్కారం అందుకున్నారు. తరువాతకాలంలో పారిశ్రామికవేత్తగా ఎంపిక ప్రజలకి సేవలు అందించారు. హైదరాబాద్ సాంకేతిక ప్రగతిలో శ్రీ మురళీ మోహన్ గారి పాత్ర కీలకం. మాదాపూర్ ప్రాంతంలో వందలాది మందికి నివాస గృహాల్ని నిర్మించారు. సామాన్యుల కల అయిన గృహ నిర్మాణాన్ని సాకారం చేసారు.
అజాత శత్రువుగా పేరు గాంచిన శ్రీ మురళీ మోహన్ గారు మా అధ్యక్షులుగా పనిచేసారు. టీవి సీరియల్స్ లో నటించి నేటితరం ప్రేక్షకులుకి చేరువ అయినారు. పద్మ పురస్కారం లభించడం నిజంగా తెలుగు వారి గర్వకారణం.నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు 4 దశాబ్దాలు పైగా తెలుగువారి చిరునవ్వులు రాజుగా ఖ్యాతి వహించారు. హస్య భావోద్వేగాన్ని తన సినిమాలు ద్వారా అందరికి సాన్నిహిత్యం చేసారు. జంధ్యాల, వంశీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డి, బాపు దర్శకుల చిత్రాలుకి వరంగా నిలిచారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి చిత్రాలు ద్వారా సందేశాన్ని సమర్పించారు. కథనాయకుడిగా పాత్ర నుంచి ప్రాముఖ్యం కలిగిన క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు పాత్రల ద్వారా ప్రతీఒక్కరి అభిమానాన్ని పొందారు. డబ్బింగ్ ఆర్టిస్టు నుంచి నిర్మాతగా ఎదిగారు. “పెళ్ళిపుస్తకం” చిత్రంలో పాట ప్రతీ వివాహ సమయంలో వినబడుతుంది.
పద్మ పురస్కారాలు పొందిన శ్రీ మురళీ మోహన్, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని వ్యక్తిగతంగా కొన్ని సందర్భాలలో కలవడం ఆనందంగా ఉంది. శ్రీ మురళీ మోహన్ గారు నా పరిశోధన నిమిత్తం ఇంటర్యూ చేయడం జరిగింది. తెలుగుప్రజల తరుపున వీరద్దరికి హృదయ పూర్వక అభినందనలు.

డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ అధ్యాపకులు, పరిశోధకులు, అమలాపురం.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *