
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్బంగా నగరంలోని ఎల్ బి నగర్ కెబిఆర్ కన్వెన్షన్ లో 21,22 తేదీలలో పద్మశాలి టెక్స్టైల్ & లైఫ్ స్టయిల్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ వల్లకటి రాజకుమార్ తదితర కార్యవర్గ సభ్యులు జంటనగరాల్లో , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పద్మశాలి సంఘాల కార్యవర్గ సభ్యులను కలసి రెండు రోజుల కార్యక్రమాలలో పద్మశాలి కులబాందవులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానించారు. దాదాపు ముప్పై సంఘాలకు చెందిన కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం అందజేయడం విశేషం. పౌరోహిత్యం నేర్చుకుని పూజా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించే పద్మశాలి పండితులను రెండు రోజుల కార్యక్రమాల్లో సత్కరిస్తున్నారు. ఈ ఎక్స్పో సందర్బంగా హెల్త్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతోంది. హెల్త్ క్యాంపులో ప్రముఖ సినీ నటుడు శ్రీ బాబూ మోహన్ హెల్త్ క్యాంపు ఆర్గనైజషన్ తరుపున మరియు ఆత్మీయ అతిధిగా విచ్చేస్తున్నారు. అధ్యక్షులు రాజకుమార్ తో పాటు ఇప్పలపల్లి రమేష్ ,ఉపాధ్యక్షులు వనమాల శంకర్ , సెక్రటరీ వల్లకటి శ్రీనివాస్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిగేటి దేవేందర్ వారికి ఆహ్వానం అందజేశారు. ఈ ఎక్స్పో కు హాజరయ్యే వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులను సన్మానించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నిర్ణయించింది. అంతేకాక వివిధ ప్రాంతాలలో ఉన్న పద్మశాలి ప్రముఖుల మధ్య పరిచయాలు, వ్యాపార వృద్ధికి ఎక్స్పో తోడ్పడగలదు. ఆహ్వానం అందజేయడానికి పీర్జాదిగూడ పద్మశాలి సేవ సంఘానికి వెళ్ళినప్పుడు వారు వెలువరించిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా రాష్ట్ర సంఘం నాయకులు పాల్గొన్నారు. పలు ప్రాంతీయ పద్మశాలి సంఘాలు క్యాలెండర్లు వెలువరించడం ఈ ఏడాది ప్రత్యేకత.




