
బుధవారం మార్చి 25వ తేదీన పార్లమెంట్ మాజీ సభ్యులు సురవరం సుధాకర రెడ్డి స్వీయకథ ఆవిష్కరణ.
సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో జరిగే ఈ ఆవిష్కరణకు సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి
సుదర్శన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరవుతారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్మారకోపన్యాసం
చేస్తారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
మరొక విశేషం ఏమిటంటే పెదనాన్న పేరిట నిర్మించిన ఆడిటోరియంలో కుమారుని స్వీయకథను
ఆవిష్కరించడం. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3-30కు.




