
ప్రస్తుతం పురుషుల క్రికెట్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఇది 19వ ఎడిషన్. పది జట్లు పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు లీగ్ దశలో పదహారు మ్యాచుల చొప్పున ఆడుతుంది. మొత్తం 84 మ్యాచులు ఉంటాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా మ్యాచుల షెడ్యూలు దశల వారీగా విడుదల చేస్తున్నారు. ప్రారంభ మ్యాచ్ కూడా రెండు రోజుల ఆలస్యంగా మార్చి 28న జరిగింది. మొదటి 20 మ్యాచులకు షెడ్యూలు విడుదల చేశారు మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఆ మ్యాచులు జరుగుతాయి.
షెడ్యూలు , జట్ల సంగతి అలా ఉంచితే ఐపీఎల్ ఛాంపియన్షిప్ లో పెద్ద వింత చోటుచేసుకుంది. ఇది యాదృచ్చికం కావచ్చు కానీ చాలా ఆశ్చర్య కరమైన విషయం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సి బి) జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ కప్పు గెలిచిన టి 20 ఇండియా జట్టులో లేడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఇండియా టి-20 జట్టులో లేడు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా భారత జట్టులో లేడు.గుజరాత్ జట్టు నాయకుడు శుభమన్ గిల్ కూడా ఇండియా టి -20 జట్టు లో లేడు.ఇక పోతే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇండియా టి -20 జట్టులో లేడు. ఇంకా ఈ వింతలు అయిపోలేదు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియా పరాగ కూడా అంతే.అతడూ ఇండియా టి -20 జట్టులో లేడు. ఎల్ ఎస్ జి నాయకుదు రిషబ్ పంత్ కూడా ఈ కోవాలో నే ఉన్నాడు.ఇండియా టి-20 జట్టులో లేడు. అన్నిటిలోకి పెద్ద వింత ఏమిటంటే.ఈ ఏడాది ఇండియాకు ట్-20 ప్రపంచ కప్ తెచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అసలు ఏ జట్టుకు కెప్టెన్ కాదు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడు. వింతల్లోకి వింత ఇది. 🥹 —- ఎన్ ఆర్ ఎస్





