పదేళ్ల స్వప్నం సాకారమైన వేళ …

పచ్చని చేలలో చిగురించిన స్వప్నం
కృష్ణా తీరాన ఉదయించిన ఉషాకిరణాలు
పుడమిపై అభ్యుదయాలకు అంకురం
ప్రగతి విత్తనాలు అందించే అభివృద్ధి ఫలం
శిలాఫలకం నుంచి ఊపిరిపోసుకున్న ఉజ్వల భవితవ్యం
భావితరాలకు వరం కానున్న నవనిర్మాతల సంకల్పం
రైతన్న పొలాల్లో కన్నులు తెరిచే ఆకాశ హర్మ్యాల బింబం
అన్నదాతల త్యాగధనుల త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం
దినకారుడ్ని వెన్నెలను సృశించే సౌధాల సౌభాగ్యం
తెలుగునేల రాజధానికి పునాది రాళ్ళ నుంచి పరుగులు తీసే శ్రమరథం
సచివాలయ నీడలో సాక్షాత్కరించిన ఆశల ప్రతిరూపం
నవ్య భవనాల్లో ప్రతిధ్వనిచే తెలుగువారి అద్భుత భవితవ్యం
అందంగా ముస్తాబు అవుతున్న అధికారులు, అమాత్యులు, ప్రజాప్రతినిధుల నివాసాలు
పాలనా తెరిచిన నేత్రాలు వెలుగుపూడి వెలుగులు
అమరావతి తెలుగువారి ఖ్యాతి
పులకరించిన తెలుగు జాతి
అందరి ఆశల జ్యోతి అమరావతి
ఇక అమరావతి అంటే దేవతల రాజధాని కాదు
తెలుగువారి స్వరధుని
ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా తీర్మానం
తెలుగువారి హృదయం పరవశించేలా ఏకగ్రీవ ఆమోదం
హలాలు వదిలి సప్తగిరుల దాకా పాదయాత్రలు చేసిన
రైతన్నల సంకల్పాల సాకారం..

డి వి ఎస్ ఎస్ శర్మ, పరిశోధకులు , 9949039175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *