
న్యూ మిలీనియం నుంచి తెలుగు సినీ పరిశ్రమలో నవతరం సృజన ప్రేక్షకులకు మరవలేని
అనుభూతిని అందిస్తుంది. 'క్షణం', 'మేజర్', 'ఎవడు' చిత్రాల ద్వారా అందరి అభినందనలు
అందుకున్న అడవి శేషు తాజా చిత్రం 'డెకాయిట్' ఈ వారం విడుదలైంది. కథ, స్క్రీన్ ప్లే లో
అడవి శేషు ప్రతిభ సినిమాపైన ఆసక్తి కలిగించింది. ప్రారంభం నుంచి చివరి వరకు
ప్రతి దృశ్యంలో భావోద్వేగాలు కనిపించాయి. ఒక రకంగా ప్రేమ గా, మొత్తం కథకు ఆధారంగా
ఉంది. 'సీతా రామం', హాయ్ నాన్న చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన
మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో సరస్వతి, జూలియట్ గా అందరి ఆదరణను పొందే రీతిలో
తెరపైన మెరిశారు. అడవి శేషు, మృణాల్ ఠాకూర్ మధ్య దృశ్యపరంగా కెమిస్ట్రీ బాగా కుదిరింది.
ఇద్దరి మధ్య ప్రేమ దృశ్యాలను దర్శకుడు పరిమితంగా చిత్రీకరించాడు. ఇది అంత బాగా లేదు.
ప్రేమ కథ అని చెప్పి యాక్షన్ దృశ్యాల మీద దృష్టి పెట్టారు. హీరో హీరోయిన్ల మధ్య
ప్రణయ దృశ్యాలు , పాటలను తెరపైన చూపితే ప్రేక్షకుల నుంచి ప్రతిస్పందన బాగా లభించేది.
చిత్రకథ , కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను
కొత్త నాటకీయత జోడించి కథను నడిపించారు. దర్శకుడు షానీల్ దేవ్ కథను , ఫ్లాష్ బ్యాక్ ను మరింత
బలంగా భావోద్వేగాల పరంగా అందిస్తే బాగుండేది. అడవి శేషు, మృణాల ఠాకూర్ అద్భుతమైన అభినయాలు ప్రేక్షకులను సినిమా నచ్చేలా చేశాయి. భీమ్స్ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంది. జ్ఞాని నేపధ్య సంగీతం అందించారు. చిత్రంలో దృశ్యాలు రిచ్ గా ఉన్నాయి. సినిమా ముగింపు
ప్రేక్షకులు ఊహించే విధంగా ఉంది. చిత్రంలో ప్రేమ, భయం, కోపం వంటి భావోద్వేగాలు స్క్రీన్ ప్లే లో
దాగి ఉన్నాయి. సృజన గల నటుడు, రచయిత, కథకులు అడవి శేషుకు అభినందనలు.
అభిరుచి కలిగిన నిర్మాత సుప్రియకు శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా చేరువ అవుతుంది. డెకాయిట్ ప్రేక్షకుల మనసులను దోస్తుందనడంలో సందేహం లేదు.
— డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు — 9949039175.




